జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ప్రభుత్వపరంగా కేటాయించేందుకు కృషిచేస్తాం.

నెట్టెం శ్రీ రఘురాం ,శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు

Jan 8, 2025 - 18:07
Jan 8, 2025 - 18:50
 0  12
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ప్రభుత్వపరంగా కేటాయించేందుకు కృషిచేస్తాం.

ఏపీ తెలంగాణ వార్త ప్రతినిధి జగ్గయ్యపేట :- జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ప్రభుత్వ పరంగా కేటాయించేందుకు కృషి చేస్తాం. నెట్టెం శ్రీ రఘురామ్, శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) జగ్గయ్యపేట పట్టణంలోని శుభమస్తు ఫంక్షన్ హాల్ నందు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల ఆత్మీయ సమావేశం జరిగింది. మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జర్నలిస్టు యూనియన్ల నాయకులు టీఎన్ఎల్ ఆచార్యులు, కాకరపర్తి రమేష్, సీనియర్ జర్నలిస్టు వార్త శ్రీనివాస్ లు పాల్గొని మాట్లాడుతూ జర్నలిస్టుల చిరకాల కోరిక అయిన ఇళ్ల స్థలాలు ఇప్పించాలని కోరారు. ఇతర సమస్యలను తెలియజేశారు ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థకు నాల్గొవ స్థంభంగా పిలువబడే పాత్రికేయ రంగం ఎంతో విలువలతో కూడిన మరియు కత్తి మీద సాము వంటిదని అన్నారు.ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పని చేసే ఏకైక వ్యవస్థ పాత్రికేయరంగమని అన్నారు.ప్రభుత్వాలు చేసే ప్రజోపయోగకర విధానాలను ప్రశంసిస్తూనే ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టే ధైర్యమున్న రంగమని అన్నారు.అటువంటి రంగాన్ని ఎంచుకున్న మీరు జగ్గయ్యపేట నియోజకవర్గ అభివృద్ధికి మాతో పాటు మీరు కూడా తోడ్పాటునందించాలని కోరారు.జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ప్రభుత్వ పరంగా కేటాయించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాలకు చెందిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State