57వ జాతీయ గ్రంథాలయ వార్షికోత్సవం
జోగులాంబ గద్వాల 17 నవంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- వడ్డేపల్లి 57 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవలలో భాగంగా నూతన జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నీలి శ్రీనివాసులు ని శాంతినగర్ సేవా సమితి సభ్యుడు షేక్ అస్లాం షరీఫ్ జిల్లా కేంద్రం లో ఆదివారం రోజు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా తాను రచించిన "నవ్వులే నవ్వులు " జోక్స్ పుస్తకం అందించారు. ఈ సందర్బంగా అస్లాం కలం నుంచి మరిన్ని రచనలు రావాలని అధ్యక్షులు అకక్క్షించారు. ఈ కార్యక్రమం లో అతడి తో పాటు యం. వి. ఫౌండేషన్ హానిమి రెడ్డి, రాజోలి మాజీ వైస్ ఎంపీపీ రేణుక దంపతులు ఉన్నారు