గ్రంథాలయంలో ఘనంగా కవి సమ్మేళనం 

Nov 17, 2024 - 19:00
Nov 17, 2024 - 20:22
 0  10
గ్రంథాలయంలో ఘనంగా కవి సమ్మేళనం 
గ్రంథాలయంలో ఘనంగా కవి సమ్మేళనం 

జోగులాంబ గద్వాల 17 నవంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల 57వ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఈరోజు గద్వాల గ్రంధాలయంలో జోగులాంబ గద్వాల జిల్లా చైర్మన్  నీలి శ్రీనివాస్  అధ్యక్షతన జరిగింది.  ముఖ్య అతిథులు  విశ్రాంత తెలుగు పండితులు శ్రీ రామ్మోహన్ రావు  విచ్చేసినారు. ఈ కవి సమ్మేళనంలో...గ్రంథాలయ ప్రాముఖ్యత విశేషాలు గద్వాల వైభవం గూర్చి కవులు పద్య వచన కవిత పాట రూపాలలో గానం చేశారు వీరందరికీ శాలువాతో ఘన సత్కారం జిల్లా గ్రంధాలయ చైర్మన్ శ్రీ నిలి శ్రీనివాస్  చేశారు. ఈ సందర్భంగా శ్రీ వారణాసి నాగేశ్వర చారి చే రచించబడిన శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత గ్రంధాన్ని అధికారికంగా గ్రంథాలయ జిల్లా చైర్మన్ శ్రీ నీలి శ్రీనివాస్  చేశారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గద్వాల గ్రంధాలయంలో విద్యార్థుల అన్ని సౌకర్యాలు కల్పిస్తామని పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు అన్ని కాంపిటీటివ్ పుస్తకాలు అందుబాటులో ఉంచుతామని భవిష్యత్తులో ఇలాంటి కవి సమ్మేళనాలు ఘనంగా చేస్తామని తెలిపినారు.గద్వాల అంటేనే విద్వత్ అని పేరు ఆ పేరుకు తగ్గట్టుగా గద్వాలలో విద్యుత్ గద్వాలకు ఆ పేరు తిరిగి వచ్చేటట్లు చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో  గ్రంథాలయాధికారి రామాంజనేయులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా సాహిత్య కళావేదిక గౌరవ అధ్యక్షులు వారణాసి నాగేశ్వర చారి మరియు ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్ కవులు కిషోర్ కుమార్ అనిమి రెడ్డి  రాజేష్  మనోజ్ దోత్రే  షరీఫ్  గోసాయి వేణు  కుమారి మహేశ్వరి  మరియు  గ్రంథాలయ సిబ్బంది శ్రీకాంత్,గోపాల్  పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333