వ్యవసాయ దేశీ డీలర్లకు క్షేత్ర సందర్శన

Nov 17, 2024 - 18:22
Nov 17, 2024 - 18:26
 0  3

మునగాల 17 నవంబర్ 20 24 తెలంగాణ వార్తా ప్రతినిధి :- జాతీయ వ్యవసాయ విస్తరణ యాజమాన్య సంస్థ హైదరాబాద్ మరియు కృషి విజ్ఞాన కేంద్రం, గడ్డీపల్లి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యవసాయ ఉత్పాదక పంపిణీ దారుల డిప్లమో కోర్సులో భాగంగా 48 వారాలపాటు నిర్వహించే శిక్షణ తరగతులలో భాగంగా నేడు దేశీ డీలర్లకు క్షేత్ర సందర్శన మునగాల మండలం మాధవరం గ్రామం లో నిర్వహించడం జరిగింది అని కేవీకే, గడ్డిపల్లి శాస్త్రవేత్త సి. హెచ్.నరేష్ గారూ తెలిపారు. జిల్లాలో వినూత్నంగా అతి తక్కువ మంది పండిస్తున్నటువంటి నూతన పంట అయినటువంటి ఖర్జూర, డ్రాగన్, సీతాఫలం వంటి పాటల సాగు చేస్తూ విజయవంతంగా చేస్తున్న అభ్యుదయ రైతు సకముడి అరవింద్ మరియు పద్మావతి వారి క్షేత్రాన్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా కేవీకే, గడ్డిపల్లి ఉద్యాన శాస్త్రవేత్త సి.హెచ్.నరేష్ మాట్లాడుతూ విత్తనం దశ నుండి పంట కోత వరకు వ్యవసాయ మరియు వ్యవసాయ అనుబంధ రంగాల లో నూతన సాంకేతిక వ్యవసాయ విధానాలతో పాటుగా విత్తనా పురుగుమందుల ఎరువుల చట్టాలపై సమగ్ర అవగాహన కల్పించడంతోపాటుగా వ్యవసాయంలో సరికొత్త రకాలైనటువంటి వివిధ పంటలను పండిస్తూ విజయవంతమైనటువంటి అభ్యుదయ రైతుల క్షేత్రాలను సందర్శిస్తూ వ్యవసాయంలోని నూతన సాంకేతికత ను డీలర్లకు అవగాహన కల్పించడంతోపాటుగా డీలర్ల ద్వారా వారి వద్దకు వచ్చేటువంటి రైతులకు వ్యవసాయ ఆధునిక సాంకేతిక విజ్ఞానంపై అవగాహన కల్పించడం జరుగుతుందని, రైతులు మారుతున్న కాలానికి అనుగుణంగా స్వల్పకాలిక పంటల కు ప్రత్యామ్నాయంగా దీర్ఘకాలిక పంటలను వేయడం ద్వారా అధిక ఆదాయం పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అనుసంధానకర్త శ్రీ. పి.శంకర్ రావు మరియు మరియు 40 మంది డీలర్లు పాల్గొన్నారు.

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State