33/11 కె.వి విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంభించిన భట్టి విక్రమార్క, జూపల్లి

02-08-2025 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం.
చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన వెల్టూరు లో విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు.
చిన్నంబావి మండలంలో వెల్లటూరు గ్రామంలో ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎంపీ మల్లు రవి పర్యటించారు.
వెల్టూరు గ్రామంలో రూ. 2.2కోట్లతో నిర్మించిన 33/11కేవీ విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంభించారు. వెల్టూరు గ్రామంలో కొత్త కళ్యాణ్ కుమార్ గారి ఇంటివద్దకు చేరుకున్న ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్కగారికి, మంత్రి జూపల్లి కృష్ణారావుకు కు మరియు MP మల్లు రవి కి MLA లు మేఘారెడ్డి కి ,రాజేష్ రెడ్డి కి, కొత్త కళ్యాణ్ కుమార్ మరియు మండల కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో వారితో పాటు ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు మెఘారెడ్డి, డా. రాజేష్ రెడ్డి, టీజీఎస్‌పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫరూఖీ,DCCB ఛైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు జూపల్లి అరుణ్, వనపర్తిి జిల్లా గ్రంథాలయ చైర్మన్ గోవర్ధనాసాగర్, తదితరులు ఉన్నారు. మరియు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.