11 వ వార్డులో సీసీ రోడ్ పనుల పరిశీలించిన
మున్సిపల్ చైర్మన్ శ్రీ G చిన్న దేవన్న గారు

సీసీ రోడ్ పనుల నాణ్యత లో రాజీ వద్దు - మున్సిపల్ చైర్మన్ జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పురపాలక సంఘం పరిధి లో 11 వ వార్డులో సిసి రోడ్ నిర్మాణ పనులను మున్సిపల్ చైర్మన్ శ్రీ G చిన్న దేవన్న గారు నేడు పరిశీలించారు.ఈ సందర్భంగా చైర్మన్ గారు మాట్లాడుతూ సిసి రొడ్డు నిర్మాణం విషయంలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ఇట్టి విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని సూచించారు.11 వ వార్డులో స్టేట్ మ్యాచింగ్ ఫండ్స్ నుండి 5 లక్షల రూపాయల తో గోపాల్ ఇంటి నుండి కూరగాయల బీమక్క ఇంటి వరకు మరియు విష్ణు వర్ధన్ రెడ్డి ఇంటి నుండి కరాటే వేణు ఇంటి వరకు సిసి రొడ్డు నిర్మాణ పనులు ప్రారంభించడం జరిగిందని తెలిపారు.కార్యక్రమం లో BRS నాయకులు శ్రీ ఉప్పరి చందు గారు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు