సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్ లో కాంగ్రెస్ నుండి(30)మంది బిర్ఎస్ లోకి చేరిక

Jan 15, 2025 - 20:01
 0  0
సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్ లో కాంగ్రెస్ నుండి(30)మంది బిర్ఎస్ లోకి చేరిక

కొడంగల్ నియోజకవర్గం దౌల్తాబాద్ మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల పై వివక్ష మరియు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా పూర్తిగా నెరవేర్చలేదని కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ పార్టీ లోకి మాజీ ఏమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో (30 మంది ) కుర్మనీ లక్స్మయ్య,గుండేపల్లి భీం రెడ్డి,తోక అశోక్, చెన్నప్ప నర్సప్ప,మల్కాప్ప తదితరులు పార్టీ లో చేరారు..గత ముఖ్యమంత్రి కెసిఆర్ గారి పథకాలు రైతులకు పై ఆయనకు ఉన్న ప్రేమ ను మేము గుర్తుంచక తప్పు చేసాము మళ్ళీ కెసిఆర్ గారి ప్రభుత్వమే రావాలని నినాదాలు చేసారు.ఈ నెల 17వ తేదీన రైతు ధర్నా కార్యక్రమం చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ లో కేటీర్ సమక్షం లో మహా ధర్నా జరుగుతుంది కావున కొడంగల్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తరలి రావాలని మాజీ ఏమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో  మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333