ప్రాపర్టీ నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు
ఇంటర్మీియట్, SSC పరీక్షలకు పకడ్బందీ గా పోలీస్ బందోబస్తు - జిల్లా ఎస్పీ రితిరాజ్,IPS
జోగులాంబ గద్వాల 27 ఫిబ్రవరి 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల. ప్రాపర్టీ నేరాలు జరుగకుండా వాటి నియంత్రణకు పోలీస్ అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ రితిరాజ్,IPS పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈ రోజు జిల్లా ఎస్పీ గద్వాల్ రూరల్ పోలీస్ స్టేషన్ ను సందర్శించి గద్వాల్ సర్కిల్ పోలీస్ అధికారులతో ప్రత్యేక సమావేశం అయి NBWs ఎక్జిక్యూట్, ఎక్సైజ్ , ఎలక్షన్స్ కేసులు, ప్రాపర్టీ కేసుల పై రివ్యూ నిర్వహించి ప్రాపర్టీ నేరాల నియంత్రణకు తీసుకోవలసిన చర్యల పై పోలీస్ అధికారులకు తగు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.... ప్రాపర్టీ నేరాలు జరుగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అందులో బాగంగా ఆయా ప్రాంతాలలో ప్రజలతో సమన్వయం చేసుకుంటూ కమ్యూనిటీ పోలీసింగ్ లో బాగంగా CC కెమెరాలు లేని చోట CC కెమేరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఆయా ప్రాంతాలలో పెట్రో కార్స్ మరియు ఫుట్ పెట్రోలింగ్ పెంచాలని సూచించారు. విజిబుల్ పోలీసింగ్ ను మరింత పెంచి నిత్యం పాయింట్ బుక్స్ ను చెక్ చేయలని సూచించారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం విజబుల్ పోలీసింగ్లో భాగంగా వాహనాల తనిఖీలు నిర్వహించాలని, రాత్రి పెట్రోలింగ్ అధికారులు లాడ్జి లు ,పాత నేరస్తులను తనిఖీ చేయాలని తెలిపారు.నేను సైతం కార్యక్రమం లో బాగంగా ఆయా షాప్స్ లలో, వ్యాపార సముదాయాలలో CC కెమేరాలు చేసుకునేటట్లు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
గద్వాల్ సర్కిల్ పరిధిలోని ఆయా పోలీస్ స్టేషన్ లలో నమోదు అయిన కేసులలో ఇన్వెస్టిగేషన్ లో అలసత్వం ప్రదర్శించకుండా పారదర్శకంగా విచారణ చేసి నిందితులకు శిక్ష పడేలా కృషి చేయలని, ప్రొయాక్టీవ్ పోలీసింగ్ తో విధులు నిర్వహించాలన్నారు. ఎన్నికల సమయంలో నమోదైన కేసులను విచారణ పూర్తి చేసి చార్జిషీట్ వేసి CC నెంబర్ల పొందాలని అలాగే ఎక్సైజ్ కేసులలో FSL రిపోర్ట్స్ తేపించుకొని కేసులను పూర్తి చేయాలన్నారు. ఇతర జిల్లాల, రాష్ట్రాల సంబందించిన నిందితులను సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి వారిని పట్టుకొని NBWs లను ఎగ్జిక్యూట్ చేయాలనీ ఆదేశించారు. రేపటి నుండి జరగబోయే ఇంటర్మీడియట్ పరీక్షలు, తరువాత జరగబోయే SSC బోర్డ్ పరీక్ష లకు పకడ్బందీ గా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలని, పేపర్స్ ను పరీక్ష కేంద్రాలకు, తరువాత పోస్టు ఆఫీస్ కు తరలించే సమయంలో ఎస్కార్ట్, పరీక్ష కేంద్రాల దగ్గర సంబంధిత అధికారులు తనిఖీలు చేసే క్రమం లో పోలీస్ సిబ్బంది ప్రజెంట్ ఉండాలని, ఏలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా ప్రాపర్ గా బందోబస్తు నిర్వహించాలని అన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ విసిటింగ్ లో బాగంగా స్టేషన్ రికార్డ్స్ ను, స్టేషన్ పరిసరాలను మరియు పోలీస్ స్టేషన్ లో సిబ్బంది నిర్వహిస్తున్న విధులను ఎస్పీ తనిఖీ చేసి పరిశీలించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో వాహనాల పార్కింగ్ ప్రదేశాలు. ఆయా కేసులలో పట్టుబడిన వాహనాలు, ఇతర ప్రాపర్టీ ని పరిశీలించారు. ఆయా వాహనాలు యొక్క వివరాలను, కేసులా స్థితిగతులను ఎస్సై పర్వతాలు ఎస్పీ కీ వివరించారు. రిసెప్షన్, స్టేషన్ రైటర్, టెక్ టీమ్, ఎస్ హెచ్ వో, మెన్ రెస్ట్ రూమ్ , లాక్ అప్ రూమ్ ను తదితర ప్రదేశాలలో 5S అమలు తీరును పరిశీలించారు. స్టేషన్ లో రోజు వారీగా నిర్వహిస్తున్న జనరల్ డైరీ,సెంట్రీ రిలీఫ్ బుక్, డ్యూటీ రోస్టర్, విలేజ్ రోస్టర్, ప్రాసెస్ రిజిస్టర్, బీట్ డ్యూటీ బుక్స్, సస్పెక్ట్ చెక్ రిజిస్టర్, సుపీరియర్ ఆఫీసర్స్ విసిటింగ్ బుక్స్, ఫైనల్ రిపోర్ట్స్ తదితర రికార్డ్స్ ను తనిఖీ చేశారు.
పోలీస్ స్టేషన్లో నమోదయిన గ్రేవ్, నాన్ గ్రేవ్ సిడి ఫైల్స్ ను పరిశీలించి, పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా పూర్తిచేయాలని, అయా కేసులలో పట్టుబడిన ప్రాపర్టీ ను కోర్టు అనుమతితో డిస్పోసల్ చేయాలని, ఆయా కేసులలో పట్టుబడ్డ వాహనాలను కోర్టు ద్వారా రిలీజ్ ఆర్డర్ తెచ్చుకొని వాహనాలను సంబంధీకులు తీసుకెళ్లేవిధంగా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఎస్సై కు సూచించారు.
ఈ కార్యక్రమంలో డి. ఎస్పీ శ్రీ కె.సత్యనారాయణ , గద్వాల్ సి. ఐ .టాటా బాబు , ఎస్పీ సీసీ లోహిత్ కుమార్, గద్వాల్ రూరల్, గద్వాల్ టౌన్, గట్టు,ధరూర్,KT దొడ్డి, మరియు మల్డకల్ ఎస్సై లు పర్వతాలు, శ్రీనివాస్, రామ కృష్ణ , విజయ్ కుమార్,శ్రీనివాస రావు , సురేష్ లు పాల్గోన్నారు.