100 సంవత్సరాల నుంచి సామాన్య ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని దోపిడీని ప్రశ్నించి పోరాడితున్న టువంటి గొప్ప చరిత్ర కలిగిన పార్టీ సిపిఐ

సీపీఐ జిల్లా కార్యదర్శి బి ఆంజనేయులు

Jan 12, 2026 - 20:35
 0  3
100 సంవత్సరాల నుంచి సామాన్య ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని దోపిడీని ప్రశ్నించి పోరాడితున్న టువంటి గొప్ప చరిత్ర కలిగిన పార్టీ సిపిఐ

 జోగులాంబ గద్వాల 12 జనవరి 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల ప్రజా సమస్యలపైన నిరంతరం పోరాటాలు చేస్తూ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పార్టీ సిపిఐ మాత్రమే నని, నిరంతరం దోపిడీ అన్యాయం పైన పోరాడిన మహోన్నత చరిత్ర సిపిఐ పార్టీదని సిపిఐ జిల్లా కార్యదర్శి బి ఆంజనేయులు అన్నారు. సోమవారం నాడు సీపీఐ జిల్లా సమితి సమావేశం గద్వాల పార్టీ కార్యాలయంలో నాగార్జున అధ్యక్షతన జరిగింది. ఈసందర్బంగా ఆంజనేయులు ముఖ్య అతీగా హాజరై మాట్లాడారు ఈనెల 18న ఖమ్మంలో బహిరంగ సభను నిర్వహించడం జరుగుతుందని, ఈ సభ విజయవంతానికి అందరు కృషి చేయాలని పిలుపు నిచ్చారు.సిపిఐ ఏర్పడి 100ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా ఖమ్మంలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ ను నిర్వహించడం జరుగుతుందని,  ఇప్పటి వరకు సిపిఐ చేసినన్ని పోరాటాలు మరే పార్టీ దేశంలో చేయలేదని పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మతాల,కులాల పేరిట  ప్రజలను మభ్యపెడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశ సమాన సమగ్ర అభివృద్దిని మరియు ప్రజల అవసరాలను, జీవితాలను గాలికొదిలేసి కేవలం మతం అంటూ కాలం గడుపుతున్నారన్నారు. దేశ పెట్టుబడిని విదేశీ ధనవంతుల చేతుల్లో పెట్టీ దేశ ప్రజల  జీవన ప్రమాణాలను దెబ్బతీస్తుందనీ,కేవలం వారి రాజకీయ లబ్ది కోసం పేద ప్రజల జీవితాలను ఇబ్బందులకు గురిచేస్తుంది అన్నారు.ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. దాదాపు  142 కోట్లపైగా జనాభా ఉన్న భారతదేశం పేద ప్రజల సమస్యలు తీరకుండా దేశం ఎట్లా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు.నేడు దేశం అభివృద్ధి చెందాలన్న , మరియు సామాన్య ప్రజల యొక్క సమస్యలు తీరాలన్న అది కేవలం పాలకుల విధానాలపై ఆధారపడి ఉందన్నారు. ఇది సాధ్యం కావాలంటే భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) అధికారం వలన మాత్రమే సాధ్యం అన్నారు.అలాగే సమావేశ ఎజెండాను, పార్టీ  కార్యాచరణను వివరించారు.అలాగే ఈ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఏర్పడి 100  సంవత్సరాలు పూర్తి చేసుకున్నదని, అందువలన  ఈ నెల 18వ తేదీన ఖమ్మంలోనీ ఎస్ఆర్ బి జిఎన్ఆర్ కళాశాల మైదానంలో జరిగే సిపిఐ భారీ బహిరంగ సభకు తెలంగాణ రాష్ట్రంతో పాటు దక్షిణాది రాష్ట్రాల నుంచి లక్షలాది ప్రజలు మరియు 40 దేశాలకు చెందిన కమ్యూనిస్టు ప్రతినిధులు హాజరవుతున్నారని, కావున ఈ సభకు అన్ని మండలాలు,గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనేలా అందరూ కృషి చేయాలని,దీనివలన  వివిధ మండలాల్లో, గ్రామాల్లో ఉన్న ప్రజలకు  సిపిఐ పార్టీ గురించి తెలిసి పార్టీ బలోపేతం అవడానికి ఉపయోగపడుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఆశన్న ,రంగన్న,రవి,ఉప్పేరు కృష్ణ, కాశీం ,ఏఐఎస్ఎఫ్ ప్రవీణ్,భరణి తదితర నాయకులు  పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333