కళ నెరవేరింది ....బస్టాండ్ లోకి బస్సు వచ్చింది

Jan 12, 2026 - 22:11
 0  206
కళ నెరవేరింది ....బస్టాండ్ లోకి బస్సు వచ్చింది

 ఏళ్ల నాటి కోరిక ...బస్టాండ్ లోకి బస్సుల రాక..

మౌలిక సదుపాయాలు ఏర్పాటు ... 

మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తా.. ఎమ్మెల్యే మందుల సామెల్

తిరుమలగిరి 13 జనవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం  తిరుమలగిరి మండలంలో 2000 సంవత్సరం లో   అప్పటి తెలుగుదేశం పార్టీ అధికారంలో తుంగతుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు చొరవతో ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి రాష్ట్ర గనుల శాఖ మంత్రి చేతుల మీదుగా డిసెంబర్ 8న ప్రయాణం ప్రమాణం ప్రారంభించారు దాదాపు ఐదేళ్లపాటు బస్టాండ్ లోకి బస్సులు రావడంతో పరిసర ప్రాంత ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేది కానీ క్రమేపీ కాలాన్ని అనుసరించి రాను రాను ప్రయాణికులకు బస్సులు బస్టాండ్ లోకి రాకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది దీంతో బస్టాండ్ నూ అందరూ మర్చిపోయారు శిథిల ఆవస్థకి చేరిపోయింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం ఉమ్మడి నల్గొండ నుండి సూర్యాపేట జిల్లాగా కొత్తగా ఆవిర్భవించిన అనంతరం తిరుమలగిరి మున్సిపాలిటీగా ఏర్పడింది గత ఐదేళ్ల నుండి తిరుమలగిరి మండల కేంద్రానికి చెందిన అఖిలపక్ష నాయకులు వివిధ కుల సంఘ నాయకులు పలుమార్లు ధర్నాలు రాస్తారోకోలు ర్యాలీలు నిర్వహించేవారు ప్రజల అవస్థలు ప్రయాణికుల బాధలు అఖిలపక్షం ఆధ్వర్యంలో తుంగతుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే మందుల సామెల్ దృష్టికి తీసుకుపోవడంతో అసెంబ్లీ లో జీరో అవర్ లో మాట్లాడుతూ తిరుమలగిరి మండల కేంద్రంలోని నిరుపేయకంగా బస్టాండ్ ఉన్నది బస్టాండ్ లోకి ఉప్పల్ జనగామ సూర్యాపేట వలిగొండ హైదరాబాద్ డిపోకు చెందిన బస్సులు బస్టాండ్ లోకి రావాలి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది ఇట్టి విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు సంబంధిత శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే స్పందించి బస్టాండ్ లోకి బస్సులు వెళ్లాలి అని అధికారులను ఆదేశించడంతో తిరుమలగిరి మండల కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణాన్ని ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే మందుల సామెల్ అనంతరం ప్రయాణ ప్రాంగణం పాత ఊరు నుండి చౌరస్తా వరకు ప్రయాణికులతో ప్రయాణం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గం అభివృద్ధి పథంలో తీసుకు వెళ్లడానికి ముందు ఉంటానని పేద ప్రజలకు అండగా ఉంటానని అలాగే బస్టాండ్ మౌలిక సదుపాయాలు అన్ని విధాల ఏర్పాటు చేయిస్తానని ప్రయాణికులకు మరియు డ్రైవర్లకు కండక్టర్లకు మంచినీటి సౌకర్యం మరియు మూత్రశాల మరుగుదొడ్లు నిర్మిస్తానని మున్సిపాలిటీని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని అన్నారు

ఏళ్ల నాటి కోరిక ...బస్టాండ్ లోకి బస్సుల రాక...!

బస్టాండ్ లో బస్సులు ఆగుతుండడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు నిత్యం చుట్టుపక్కల గ్రామాల నుండి చాలామంది ప్రజలు తిరుమలగిరికి వస్తుంటారు వారి సౌకర్యం కోసం తిరుమలగిరి బస్టాండులో బస్సులు ఆగాలనేది ఎన్నో ఏళ్ల నాటి కోరిక అది నెరవేరడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ కు మరియు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. . ఈ కార్యక్రమంలో సూర్యాపేట డిపో మేనేజర్ సునీత ఏ డి సి భాస్కర్ మండల పార్టీ అధ్యక్షులు నరేష్ సుంకరి జనార్దన్ జుమ్మిలాల్ కొండల్ రెడ్డి లక్ష్మయ్య బత్తుల శీను రాము గౌడ్  పేరాల వీరేష్ తిరుమని యాదగిరి అశోక్ రెడ్డి నవీన్ భాస్కర్ వంశీ అఖిలపక్ష నాయకులు వివిధ కుల సంఘాలు వివిధ గ్రామా సర్పంచులు పార్టీ కార్యకర్తలు ప్రయాణికులు తదితరులు పాల్గొన్నారు

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి