ట్రాఫిక్ చలానాలతో పరేషాన్

శ్రీయుత SP సూర్యపేట గారికి.
కోదాడ పట్టణంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పడిన నాటి నుండి నేటి వరకు ట్రాఫిక్ నియమ నిబంధనల ప్రకారం రోడ్లపై ఉన్న ఆక్రమణలను తొలగించుట గాని, వ్యాపారులు ఫుట్ ఫాత్ లు దాటి తారు రోడ్డు వరకు ఆక్రమించి వారి సామానులు డిస్ ప్లే చేయుట లేక తోపుడుబండ్ల వారికి అద్దెకు ఇచ్చుట చేస్తున్నా గాని, బహుళ అంతస్తులు వారు, కమర్షియల్ బ్యాంకులు, మున్సిపాలిటీ కమర్షియల్ షాపులకు, హాస్పిటల్స్, హోటల్స్ఉన్న సెల్లార్ లను అద్దెకు ఇచ్చి "రోడ్లనే పార్కింగ్ ప్లేస్" గా, ఉపయోగిస్తున్నా, రోడ్లపైనే గుడిసెలలో కాపురాలు చేస్తున్నా, రోడ్లకు అడ్డంగా విద్యుత్ ట్రాన్స్ఫారాలు, అక్రమ నిర్మాణాలు (రంగా థియేటర్ షాపులు, DSP ఆఫీస్) మొదలగు అనేక అడ్డంకులు ఉన్న "టాస్క్ ఫోర్స్" కమిటీతో, అఖిలపక్ష కమిటీల సహకారంతో ట్రాఫిక్ నియంత్రణ చేసి కాలిబాటన వెళ్లేవారికి, ప్రజలందరికి తోడ్పడవలసిన పోలీసులు ట్రాఫిక్కుకు అంతరాయం కలిగిస్తూ, చలానాలు వేస్తూ కాలం గడుపుట క్షమార్హమా? జిల్లా, రాష్ట్ర ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు మా ట్రాఫిక్ ఇబ్బందులను సమీక్షించి శాశ్విత పరిష్కారం చేయాలని మా డిమాండ్.
కుదరవల్లి మోహన్ కృష్ణ.