సగరులను బీసీ 'ఎ'లోకి మార్చాలని మంత్రి శ్రీదర్ బాబుకు సగర సంఘం వినతి 

సగరల సమస్యల పరిష్కారానికి అన్నివిధాలుగా కృషి : మంత్రి శ్రీదర్ బాబు

Apr 5, 2024 - 19:38
Apr 6, 2024 - 08:57
 0  10
సగరులను బీసీ 'ఎ'లోకి మార్చాలని మంత్రి శ్రీదర్ బాబుకు సగర సంఘం వినతి 

శేరిలింగంపల్లి తెలంగాణవార్త, ఏప్రిల్ 05 :-కాంగ్రెస్ ప్రభుత్వం సగరల సమస్యల పరిష్కారానికి అన్నివిధాలుగా కృషి చేస్తుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ చైర్మన్ దుద్దిల్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. శుక్రవారం తుక్కుగూడలో సగర సంఘం అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర ఆధ్వర్యంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ చైర్మన్ దుద్దిల్ల శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ రాష్ట్రంలో సగరులను బీసీ 'డీ' నుంచి 'ఏ'లోకి మార్చే అంశాన్ని పొందుపరచాలని విజ్ఞప్తి చేశారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంఘం గౌరవ సలహాదారులు కేపీ రామ్ సగర, గ్రేటర్ హైదరాబాద్ గౌరవాధ్యక్షులు అక్కని వెంకటస్వామి సగర, రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలుక శ్రీనివాస్ సగర, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సంగిశెట్టి గంగాధర్ సగర, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బంగారి ఆంజనేయులు సగర, గ్రేటర్ సంయుక్త కార్యదర్శి నాగరాల రామకృష్ణ సగర తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333