నూతన మేనేజ్మెంట్ కోర్స్ కాలేజ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి
నిజామాబాద్ ఏప్రిల్ 05 తెలంగాణవార్త ప్రతినిధి:- నిజామాబాద్ నగరంలోని బైపాస్ రోడ్డులో బ్రైట్ బేగిన్నెర్స్ కాలేజీ అఫ్ హోటల్ మేనేజ్మెంట్ ను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు హోటల్ మేనేజ్మెంట్ లో శిక్షణ ఇస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న బ్రైట్ బేగిన్నెర్స్ యాజమాన్యాన్ని అభినందించారు.ఈ సందర్బంగా కాలేజీ ఎండీలు సాయిప్రసాద్, వంశీకృష్ణ లు మాట్లాడుతూ పదో తరగతి ఉత్తిర్ణులైన వారికీ మా సంస్థలో ఆరు నెలల పాటు కోచింగ్ ఇచ్చి,మరో ఆరు నెలలు అబ్రాడ్ లో వేతనంతో కూడిన శిక్షణ ఇస్తూ ఉద్యోగాలు ఇప్పిస్తున్నట్లు తెలిపారు.గల్ఫ్ దేశాల్లో,ఆసియన్ దేశాల్లో పెద్దపెద్ద హోటల్లు,నౌకాయన, విమాన,సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు.కేవలం తక్కువ మొత్తం ఫీజ్ తో ఈ అవకాశం ఉన్నదని,దీనిని నిరుద్యోగ యువత సధ్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమం లో ప్రిన్సిపాల్ గోపినాథ్,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.