నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలి:జెడ్పి చైర్ పర్సన్ సరిత

Jun 13, 2024 - 20:39
Jun 13, 2024 - 20:39
 0  5
నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలి:జెడ్పి చైర్ పర్సన్ సరిత

జోగులాంబ గద్వాల 13 జూన్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి :-  జిల్లాలో నిరంతరం విద్యుత్ సరఫరా చేయడంతో పాటు ఎక్కడ ఎలాంటి అవాంతర సంఘటన జరగకుండా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని జెడ్పి చైర్ పర్సన్ సరిత అన్నారు.గురువారం గద్వాల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో విద్యుత్ జిల్లా అధికారులతో జెడ్పి చైర్ పర్సన్ సరిత మరియు మున్సిపల్ చైర్మన్ బి.ఎస్‌. కేశవ్ సమీక్షా సమవేశం నిర్వహించారు.గత కొంతకాలంగా వార్డ్ లలో,గ్రామాలలో విద్యుత్ అంతరాయం వస్తుందని ప్రజలు తమ దృష్టికి నేరుగా, ఫోనుల ద్వారా సమాచారం రావడంతో విద్యుత్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.

 ఈ సందర్భంగా విద్యుత్ ఎస్ఈ,డీఈ,ఏఈ లతో ఆమె మాట్లాడుతూ ఇటీవల పలు చోట్ల విద్యుత్తు సరఫరా నిలి‌పేసిన సంఘటనలపై విద్యుత్తు శాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.కొందరు అధికారులు, సిబ్బంది నిర్ల‌క్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ వారు అధికారులపై మండిపడ్డారు. ప్రభుత్వానికి చెడ్డ‌పేరు తెచ్చేందుకు, విద్యుత్తుపై దుష్ప్రచారం చేసేందుకు కొందరు కుట్రలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. అటువంటి అధికారులు,సిబ్బందిపై క‌ఠిన చర్యలు తీసుకుంటామని జెడ్పి చైర్ పర్సన్, మున్సిపల్ చైర్మన్ హెచ్చరించారు.సాంకేతిక, ప్ర‌కృతిప‌ర‌మైన కార‌ణాలు మిన‌హా ఉద్దేశ‌పూర్వకంగా ఎవ‌రైనా కోత‌లకు కార‌ణ‌మైతే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు..అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో గృహలక్ష్మి పథకంలో భాగంగా ఇంటింటికీ ఉచిత విద్యుత్ జీరో బిల్లులు అమలు చేయాలని,ఎవరికైనా జీరో బిల్లులు రాని పక్షంలో గ్రామీణప్రాంతాలలోని లబ్ధిదారులు మండల ఎంపిడిఓ కార్యాలయంలో, మున్సిపాలిటీకి చెందిన వార్డ్ ప్రజలు మున్సిపల్ కార్యాలయంలో నమోదు చేసుకోవాలని తెలపాలని అధికారులకు సూచించారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State