పాడుబడిన పాగింగ్ మిషన్లు పట్టించుకోని అధికారులు

Aug 19, 2024 - 21:22
Aug 20, 2024 - 07:09
 0  19
పాడుబడిన పాగింగ్ మిషన్లు పట్టించుకోని అధికారులు

చిన్నంబావి మండల పరిసర ప్రాంతాలలో పాడుబడిన ఫాగింగ్ మిషన్ డ్లు,పట్టించుకోని అధికారులు.

19-08-2024 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం. చిన్నంబావి మండలం లోని పలు గ్రామాలలో చెడిపోయిన ఫాగింగ్ మిషన్లు పట్టించుకోని అధికారులు స్పెషల్ ఆఫీసర్లు ఇది వర్షాకాల సీజన్ రోడ్ల వెంట కాళీ ప్రదేశాలలో గడ్డి ఎక్కువగా పెరిగి నీళ్లు ఎక్కువ రోజులు ఆగి దోమలు ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయి ఈ దోమకాటు వలన మలేరియా,డెంగ్యూ, టైఫాయిడ్, వైరల్ జ్వరాలు ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయి ఈ వర్షాకాలం సీజన్ ప్రారంభమై మూడు నెలలు అవుతున్న ఇప్పటివరకు ఒక్కసారి కూడా గ్రామాలలో ఫాగింగ్ చేయలేదు అలంకారప్రాయంగానే గ్రామ పంచాయతీలలో ఫాగింగ్ మిషన్లు దర్శనమిస్తున్నాయి మండల అధికారులు చొరవ తీసుకొని గ్రామాలలో వారానికి రెండు సార్లు ఈ వర్షాకాల సీజన్లో ఫాగింగ్ చేసే విధంగా చూడాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పుడు చిన్నంబావి మండలం లోని ఏ గ్రామంలో చూసిన జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయి వీటి నివారణ కొరకు వైద్య సిబ్బంది కూడా గ్రామాలలో అందుబాటులో ఉండి వైద్యం అందించాలని ప్రజలు కోరుతున్నారు.వైద్య అధికారులు వారానికి ఒకసారి మాత్రమే వస్తున్నారు అని ప్రజలు వాపోతున్నారు. గ్రామంలో రోడ్ల వెంబడి బ్లీచింగ్ పౌడర్ చల్లాలి ఈ కార్యక్రమం కూడా చేయడం లేదు అదేవిధంగా నీరు నిల్వ ఉండే ప్రాంతాలలో ఆయిల్ బాల్స్ వదిలి దోమల లార్వాలను చంపే అవకాశం ఉన్నప్పటికీ కూడా పట్టించుకునే అధికారులు కరువయ్యారు.

Vishnu Sagar Chinnamabavi Mandal Reporter Wanaparthi District Telangana State