శివం ఓం చారిటబుల్ ట్రస్ట్ సమావేశం.. నూతన కమిటీ ఎన్నిక
జగిత్యాల, 09 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-జగిత్యాల పట్టణ కేంద్రంలో ఆదివారం శివం ఓం చారిటబుల్ ట్రస్ట్ కమిటీ సమావేశం ట్రస్టు చైర్మన్ గర్వందుల రమేష్ అధ్వర్యంలో నిర్వహించారు. వివిధ విభాగాలకు నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. విధ్య కమిటీకి ఏకగ్రీవంగా కన్వినర్ గా సైదు రాజు, కో కన్వీనర్లుగా పల్లె గంగాధర్, జిల్లా జయశ్రీ లు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ట్రస్ట్ కు సంబంధించిన వివిధ అంశాలు విధి విధానాలు,
రాబోవు రోజుల్లో విద్యార్దులకు మెరుగైన నాణ్యత విద్యకోసం ఈ నూతన విద్య కమిటీ పనిచేస్తుందని తెలిపారు.
ఈ సమావేశంలో గోల్లపెల్లి శ్రీకాంత్, గోడిసేలా రమేష్, మల్యాల సతీష్ కుమార్, చంద్రయ్య, లచయ్య,తిరుపతి, సురేష్, శేఖర్, లింగయ్య, గంగాధర్, వెంకటేష్, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.