ప్రతి పిర్యాదు పట్ల స్పందిస్తాం, ప్రజలకు 24 గంటలు అందుబాటులో పోలీస్
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు.
దొంగతనాల నిరోధానికి పూర్తిస్థాయిలో నిఘా.
విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ శ్రీ తోట శ్రీనివాస రావు,
జోగులాంబ గద్వాల 22 జూన్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- జిల్లా పరిధిలోని ప్రజలకు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటూ చట్ట పరిధిలో ప్రజల సమస్యలను పరిష్కారం చేస్తూ ప్రజల భద్రత ప్రధాన లక్ష్యoగా పని చేస్తామని జిల్లా ఎస్పి శ్రీ తోట శ్రీనివాస రావు అన్నారు.
జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఎస్పి మాట్లాడుతూ... జిల్లా పరిధిలోని సామ్యాసుడిని దృష్టిలో పెట్టికోని వారికి భరోసా కలిగించే విధంగా పోలీసింగ్ వుంటుందని, శాంతి భద్రతల విషయంలోను కఠినంగా వుంటామని, ఎవరైన శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని, విద్వేషాలను రెచ్చగోట్టేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాము అని అన్నారు.
మహిళలు రక్షణ కోసం, మహిళలకు వ్యతిరేకంగా జరిగే నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతామని, అలగే దొంగతనాల నిరోధానికి మరిన్ని CC కెమేరాలు ఏర్పాటు చేయించడం తో పాటు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని అందుకు ప్రజల సహకారం కూడా అవసరమని అన్నారు. జిల్లా లో రోడ్డు ప్రమాదాల నివారణకు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చొరవ తీసుకుంటానని అన్నారు. చెడు పనులను ఎవరు ప్రోత్సహించిన ఉపేక్షించేది లేదని ఎస్పీ అన్నారు.
ఈ కార్యక్రమం లో డీ. ఎస్పీ సత్యనారాయణ పాల్గొన్నారు...