మన జాగ్రత్తలో మనం ఉండాలి ప్రజలకు సూచన!ఎస్సై నాగరాజు
అడ్డగూడూరు 25 అక్టోబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:-
అడ్డగూడూరు మండల కేంద్రంలోని వివిధ గ్రామాల ప్రజలకు పోలీసు వారు తెలుపు విషయం రాత్రి పగటి పూట ఇండ్లలో జరిగే దొంగతనాల సూచన వివరాలు:సాధ్యమైనంత వరకు మీ యొక్క బంగారు ఆభరణాలను బ్యాంకు లాకర్లలోభద్రపరచుకోగలరు.ఒకవేళ మీ ఇంట్లో బంగారు ఆభరణాలను దాచుకున్నట్లయితే అట్టి ఆభరణాలను కవర్లలో గాని, బట్టలలో కట్టి వాటిని లో రూప్ లలో గాని,ఎవరికి కనిపించకుండా బట్టలలో గాని దాచిపెట్టుకోగలరు.
అవసరానికి మించిన నగదును ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటిలో ఉంచకండి, వాటిని బ్యాంకుల్లో దాచుకోగలరు. మీ ఇంటికి తాళం వేస్తే అట్టి తాళమును కనిపించకుండా డోర్ కర్టెన్ ను అడ్డుగా ఉంచగలరు. గేటు తాళాలను ఎవరికి కనిపించకుండా లోపలి వైపు వేసుకోగలరు.మీరు ఇంటికి తాళం వేసి దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్లో గాని, మీ పక్కింటి వారికి గాని సమాచారం ఇవ్వండి. అల్మరా తాళం చేతులను ఎట్టి పరిస్థితుల్లో ప్రక్కనే ఉన్న సెల్పులలో గాని, డ్రెస్సింగ్ టేబుల్ లో గాని పెట్టకండి.కొంతమంది ఇంటికి తాళం వేసి తాళం చేతులను బూట్లలో గాని, కిటికీలో గాని, దర్వాజపై గాని దాచి వెళుతుంటారు.ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ విధంగా తాళం చేతులను పెట్టకూడదు. నీకు తెలిసిన వారే ఆ తాళం చేతులను తీసుకొని దొంగతనాలు చేసే అవకాశం ఎక్కువగా ఉన్నది.
మీ ఇంటికి సీసీ కెమెరాలు అమర్చుకోండి. వీలైతే కాలనీ ప్రతినిధులతో మాట్లాడి సీసీ కెమెరాల ఏర్పాటును చేసుకోగలరు.పై సూచనలు పాటించినచో ఒకవేళ దొంగతనాలు జరిగిన నష్టం విలువ తక్కువగా ఉంటుంది.దొంగతనాలు జరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.గ్రూపులో ఉన్న సభ్యులందరికీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రతి వ్యక్తికి చేర వేయగలరు.మరియు దొంగతనాల నివారణలో పాలుపంచుకోగలరు. అడ్డగూడూరు ఎస్సై డి.నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు.