వికలాంగుల చట్టాలను నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఉద్యమం

Nov 7, 2025 - 18:06
 0  6
వికలాంగుల చట్టాలను నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఉద్యమం

భువనగిరి 07 నవంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– వికలాంగుల చట్టలు సంక్షేమ పథకాలపై పై 2026 ఫిబ్రవరి 20-22 తేదీల్లో యాదగిరి గుట్టలో రాష్ట్ర సదస్సు ఎన్ టి ఆర్ డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం అడివయ్య వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించే జీవో 34 అమలు కోసం ఉద్యమం ఎన్ పి ఆర్ డి.రాష్ట్ర అధ్యక్షులు కె వెంకట్ వికలాంగుల చట్టాలు సంక్షేమ పథకాలపై 2026 ఫిబ్రవరి 20-22 తేదీల్లో యాదగిరి గుట్టలో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నామని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం అడివయ్య తెలిపారు.వికలాంగుల హక్కుల జాతీయ వేదిక యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు యాదగిరి గుట్ట పట్టణంలోని పద్మశాలి సంఘం భవనంలో జిల్లా అధ్యక్షులు సూరపంగా ప్రకాష్ అధ్యక్షతన జిల్లా విస్తృత సమావేశం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సంఘం ప్రధాన కార్యదర్శి యం అడివయ్య మాట్లాడుతూ.. ఒకే దేశం ఒకే ఎన్నిక గురించి మాట్లాడుతున్న నరేంద్ర మోడీ ఒకే పెన్షన్ కోసం ఎందుకు మాట్లాడడం లేదని అన్నారు.దేశంలో వికలాంగులు అనేక సమస్యలతో సతమాతం అవుతుంటే కేంద్రం ఎందుకు స్పందించడం లేదనిఅన్నారు.వికలాంగుల పట్ల కొనసాగుతున్న వివక్షత, అసమానతలను నిర్ములించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో 25 శాతం వికలాంగులకు అదనంగా ఇవ్వలని చట్టంలో ఉంటే ఎందుకు అమలు చేయడం లేదని అన్నారు వికలాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత ప్రభుత్వాలకు లేదా అని అన్నారు.సుగమ్య భరత అభియాన్ పథకం అమలులో కేంద్రం నిర్లక్ష్యం చేస్తుందని అన్నారు. ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ నినాదానికే పరిమితం అవుతుందని అన్నారు.ప్రభుత్వ, ప్రయివేట్ విద్యా సంస్థల్లో స్పెషల్ టీచర్స్ లను నియమించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ విద్యా సంస్థల్లో 5 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2012 నుండి కేంద్ర ప్రభుత్వం ఇందిరా గాంధీ నేషనల్ డిసబుల్డ్ పెన్షన్ కేవలం 300 రూపాయలే ఇస్తుందని అన్నారు. ధరల పెరుగుదలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం వాటా 5వేలకు పెంచాలని డిమాండ్ చేశారు.ఉద్యోగలాలో 4 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్నా బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను నిధుల కోత విదిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ సంస్థలను ప్రయివేట్ పరం చేసి వికలాంగుల రిజర్వేషన్లను తీసివేయాలని కుట్రలు చేస్తుందని అన్నారు. పోరాడి సాధించుకున్న వికలాంగుల చట్టాలను అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యన్ని తిప్పికొడుతామణి అన్నారు.వికలాంగుల చట్టాలు, సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని అన్నారు. వికలాంగుల చట్టాలు , సంక్షేమ పథకాలు, ప్రభుత్వ జీవోలపై 2026 ఫిబ్రవరి 20-22 తేదీల్లో యాదగిరిగుట్టలో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. సదస్సుకు 33 జిల్లాల నుండి 500 మంది ప్రతినిధులు హాజరు అవుతున్నారని అన్నారు. NPRD రాష్ట్ర అధ్యక్షులు కె వెంకట్ మాట్లాడుతు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల కార్పొరేషన్ బలోపేతం కోసం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా 2023 లో ప్రభుత్వం విడుదల చేసిన జీవో 34ను అమలు చేయాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 23 నెలలు అవుతున్న పెన్షన్ ఎందుకు పెంచడం లేదని అన్నారు. పెన్షన్స్ పెంచకుండా పెన్షన్స్ రద్దు చేసే హక్కు ప్రభుత్వంకు ఎక్కడిదని అన్నారు.స్థానిక సంస్థల్లో వికలాంగులకు ప్రాతినిధ్యం కల్పించేందుకు అసెంబ్లీలో చట్టం చేయాలని డిమాండ్. చేశారు.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వికలాంగులకు దక్కడం లేదని.అన్నారు.ఇందిరమ్మ ఇండ్లలో వికలాంగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సామూహిక ప్రాంతాలు వికలాంగులు వినియోగించుకునే విదంగా ఎందుకు చేయడం లేదని అన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులను గుర్తించి వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత చేయుత పెన్షన్స్ 1.98 లక్షల పెన్షన్స్ రద్దు చేసినరాని అన్నారు. రద్దు చేసిన పెన్షన్స్ పునరుద్దరణ చేయాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలకు వికలాంగులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బి స్వామి, జిల్లా ప్రధాన ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్, రాష్ట్ర కమిటీ సభ్యులు పాముకుంట్ల చందు, కె లలిత, జిల్లా ఉపాధ్యక్షులు పిట్ట శ్యామసుందర్ జిల్లా సహాయ కార్యదర్శి గడ్డం యాదగిరి నాయకులు సంజీవ శంకర్, అంజయ్య, పిట్ట  శ్రీనివాస్ రెడ్డి, అనసూజా, బానోత్  హరి, ఎర్రవెల్లి నాగేష్ మంజుల, లింగనాయక్, చందు రాయరాల సత్యనారాయణ హరిబాబు కే బాలరాజ్ తదితరు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333