గీత కార్మికులకు ఎక్స్గ్రేషియా చెల్లించాలి!రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్

Jul 5, 2025 - 20:04
 0  3
గీత కార్మికులకు ఎక్స్గ్రేషియా చెల్లించాలి!రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్

మండల అధ్యక్షుడు లింగాల రామస్వామి
అడ్డగూడూరు 04 జూలై 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు లింగాల రామస్వామి గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశానికి హాజరైన తెలంగాణ గౌడ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొల్కపురి శ్రీకాంత్ గౌడ్ తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడుస్తున్న తాడిచెట్ల పై నుండి కింద పడి మరణించిన గీతా కార్మికులకు రావలసిన పెండింగ్ 5 లక్షల ఎక్సిగేసియాను గత సంవత్సరం 2024 జులై 14వ తారీకు నాడు లస్కర్ గూడ వేదికగా కాటమయ్య రక్ష పంపిణీ కార్యక్రమంలో మాట్లాడిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెల రోజుల్లో పెండింగ్ ఎక్సిగేసియాను ఇస్తానని మాట ఇవ్వడం జరిగింది.కానీ ఇంతవరకు గీతా కార్మికులకు ప్రభుత్వం నుండి అందే అటువంటి ఎక్సిగేషియా అందకపోగా ఈనెల జూలై 14 వ తారీఖు నాడు తిరుమలగిరిలో జరిగే రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమాన్నికి  వస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే వేదిక మీద ఎక్సిగేషియా చెక్కులను కాటమయ్య రక్ష కిట్లను పంపిని చేయాలని డిమాండ్ చేశారు.లేనియెడల పెద్ద ఎత్తున ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డిని అడ్డుకుంటామని హెచ్చరించడం జరిగింది.కృష్ణమూర్తి గౌడ్,  లింగస్వామి,సైదులు,యాదగిరి మహంకాళి,శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333