తిమ్మిడి కుటుంబానికి పీఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం

Nov 7, 2025 - 21:30
Nov 7, 2025 - 21:31
 0  23
తిమ్మిడి కుటుంబానికి పీఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం

తిరుమలయపాలెం 07 నవంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండల పరదిలోని బచ్చోడు గ్రామంలోని అనారోగ్యంతో మరణించిన కీర్తిశేషులు. తిమ్మిడి రాంబాయ్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటానని ప్రగడ సానుభూతి తెలుపుతూ..వారి కుటుంబానికి 10వేల రూపాయల ఆర్థిక సాయం కుటుంబానికి అందజేశారు.

నిరుపేద,సామాన్య కుటుంబాన్ని ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుండే పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ తిరుమలాయపాలెం మండలంలో మరోసారి తమ మానవత్వాన్ని చాటుకుంది. మృతి చెందిన వ్యక్తుల కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు ట్రస్ట్ తరపున శుక్రవారం రోజు సహాయక కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ రెవెన్యూ,గృహ నిర్మాణం,సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పర్యవేక్షణలో నడుస్తున్న పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఈ నెలలో మండలంలో మరణించిన ఒక్కొక్క కుటుంబానికి 10 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని కాంగ్రెస్ నాయకులు అందజేశారు.ఈ కార్యక్రమంలో మండలంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు,మంత్రి పొంగులేటి అభిమానులు అధిక సంఖ్యలో మృతుల కుటుంబానికి ఆత్మీయంగా పలకరించి,వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.కష్టకాలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తమ ట్రస్ట్ ద్వారా అందిస్తున్న ఈ సహాయం పట్ల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.