గూడెం గ్రామంలో మొక్కజొన్న పై మెగా హార్వెస్ట్ డే ప్రదర్శన

Nov 7, 2025 - 17:05
 0  54
గూడెం గ్రామంలో మొక్కజొన్న పై మెగా హార్వెస్ట్ డే ప్రదర్శన

  గూడెం గ్రామంలో మొక్కజొన్న పై మెగా హార్వెస్ట్ డే ప్రదర్శన

07-11-2025 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం : చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన గూడెం గ్రామంలో అడ్వాంట సీడ్ పిఏసి 741 ఆధ్వర్యంలో గొందిపర్ల శివ& గొందిపర్ల స్వామి రైతు పొలంలో మొక్కజొన్న మెగా హార్వెస్ట్ మొక్కజొన్నపై మెగా హార్వెస్ట్ డే క్షేత్రస్థాయి ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు ఒక గుంటలో మొక్కజొన్న కోసి, రైతు ముందే గిర్నిపట్టి ఎకరానికి వర్షాకాలంలో 31 క్వింటాళ్ల వరకు దిగుబడి సాధ్యమని ప్రత్యక్షంగా చూపించారు. పీఏసీ 741 రకం మొక్కజొన్న తక్కువ ఎత్తుతో పెరిగి గాలివానలకు తట్టుకుని నిలబడుతుందని, నారింజ రంగు గింజలు మార్కెట్లో మంచి ధర తెస్తాయని, బెండు సన్నగా, కంకులు సమానంగా రావడం. ఉంటుందని రైతులకు గొందిపర్ల శివ పొలం దగ్గర ప్రత్యేక సాక్షిగా లైవ్ చూపించారు. అడ్వాంటే కంపెనీ అధికారులు చూయించిన ఫలితాన్ని చూసి రైతులు అధిక సంఖ్యలో అడ్వాంటే కంపెనీ వారు పెట్టిన మీటింగ్లో పాల్గొని కంపెనీ వారు చెప్పిన మాటలను విని సంబరపడ్డారు.

చాలామంది రైతులు నెక్స్ట్ క్రాఫ్ట్ కు అడ్వాంటేజ్ పి ఏ సి 741 మొక్కజొన్న విత్తనాలు తీసుకుంటామని మాకు ఈ విధంగా చెప్పేవారు లేక పొలంలో దిగుబడి తీయలేకపోతున్నామని రైతులు వాపోయారు.

 కంపెనీవారు ముందుగా గ్రామంలో గొందిపర్ల  శివ సన్నాఫ్ గొందిపర్ల స్వామి ని శాలువాతో సన్మానించి గొందిపర్ల స్వామికి గిఫ్టుగా గొడుగుని ఇచ్చి సన్మానించారు. తదన అనంతరం గొందిపర్ల స్వామి పొలం దగ్గర కంపెనీవారు గ్రామ రైతు సోదరులకు అన్న భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగినది.

 ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ రైతులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.

Vishnu Sagar Chinnamabavi Mandal Reporter Wanaparthi District Telangana State