వందేళ్ల ఘన చరిత్ర సిపిఐ పార్టీది

Nov 15, 2025 - 19:29
 0  2

రాష్ట్ర శతాబ్ది ఉత్సవాల బస్సు జాతను ప్రారంభించిన సిపిఐ జాతీయ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి

కమ్యూనిస్టులు లేని దేశాల్లో పెట్టుబడిదారులదే రాజ్యం
 - సిపిఐ ఎమ్మెల్సీ నెల్లకంటి సత్య
 -- ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే కమ్యూనిస్టు జెండాను ప్రతి ఒక్కరు పట్టాలి
   - సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ 

 జోగులాంబ గద్వాల 15 నవంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి :  గద్వాల  భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వందేళ్ల సందర్భంగా  నిర్వహించే రాష్ట్ర బస్సు జాతాను గద్వాల జిల్లా కేంద్రంలో శనివారం నాడు సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. సిపిఐ పార్టీ శతాబ్ద ఉత్సవాల సందర్భంగా జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో సిపిఐ బహిరంగ సభను సిపిఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు అధ్యక్షతన నిర్వహించడం జరుగింది .ఈ సందర్భంగా సిపిఐ జాతియా కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి, సిపిఐ పార్టీ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాల్ నరసింహలు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ సిపిఐ రాష్ట్ర బస్సు జాతను వంద సంవత్సరాల సందర్భంగా గద్వాలలో ప్రారంభించడం జరిగింది ఇది కొత్తగూడెంలో ముగించడం జరుగుతుందనీ అన్నారు. ఈ గద్వాల పోరాటాల నడిగడ్డ అని విరయోధులను కన్నా గడ్డయని అందుకే ఇక్కడ నుంచి రాష్ట్ర బస్సు జాతను ప్రారంభించడం జరుగుతుందన్నారు అలాగే ప్రతి వ్యక్తి సిపిఐ జెండాను పట్టి నడిగడ్డ సమస్యల పైన పోరాడాలన్నారు కమ్యూనిస్టు పార్టీల పోరాటంతోనే  రాష్ట్రములో కేంద్రంలో పాలకుల అరాచకాన్ని తిప్పికొట్టడం సాధ్యం అన్నారు.సిపిఐ ఏర్పడిన వందేళ్ళలో ఈ దేశంలో ఉండే సామాన్యులు పేద ప్రజలు, కార్మికులు ,రైతులు, ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై నిరంతరం పోరాటం చేసిన ఘనత సిపిఐ పార్టీది అన్నారు.ఈ దేశాన్ని బ్రిటిష్ వారి పాలన నుంచి విముక్తులను చేసిందని,తెలంగాణ నైజం విముక్తి కై పోరాడి రాచరిక పాలన నుంచి విముక్తి చేసిందన్నారు నేటికీ ప్రజా సమస్యల కోసం అనేక పోరాటాలు చేసిందని, పెట్టుబడుదారులు, భూస్వాముల చేతిలో పేద ప్రజలు  అనేక ఇబ్బందులను ఎదుర్కొనే వారని, ఎలాగైనా భూస్వామ్య వ్యవస్థను అంతం చేయాలని సిపిఐ అనేక పోరాటాలు చేసి సామాన్య ప్రజలను బానిసత్వం నుంచి విముక్తి చేసిందన్నారు.పేదల కోసం దున్నే వాడికి భూమి కావాలని అనేక భూములను దానం చేసిన ఘనత సిపిఐ ది అన్నారు.నేడు కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం బడా పెట్టుబడిదారులతో చేతులు కలిపి మన దేశ భవిష్యత్తును ఆటంకంలోకి పెడుతుందని మండపడ్డారు. దేశం సమైక్యంగా ఉండకుండగా మతం పేరుతోటి వర్గాలుగా విభజించి మెజార్టీ వర్గం ఓట్లతోటి చిరకాలంగా 1అధికారంలో ఉండాలని అందుకో మతవిద్వేషాలని పెంచి పోషిస్తుంది అన్నారు. పేద ప్రజలను వెట్టి చాకిరి నుంచి విముక్తి చేయాలని అనేక పోరాటాలు నిర్వహించి, విజయాలు సాధించడం జరిగిందనీ గుర్తుచేసారు.భవిష్యత్తులో ప్రజా ఉద్యమాలు నిర్మించేందుకు దేశాన్ని సమైక్యంగా నిర్మించేందుకు పార్టీని బలోపేతం చేసేందుకు ఈ యొక్క వందేళ్ళ బస్సుజాత కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని అలాగే వందేళ్ళ సిపిఐ ఉత్సవాలలో భాగంగా డిసెంబర్ 26వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో ఐదు లక్షల మంది తో భారీ బహిరంగ సభను నిర్వహించడం జరుగుతుందని ఈ యొక్క సభకు ప్రపంచ దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కమ్యూనిస్టు మేధావులు హాజరవుతారని,కావున అధిక సంఖ్యలో ప్రజలు వచ్చి, ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని  పిలుపు నిచ్చారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రంగన్న ఆశన్న అలాగే నాగర్ దొడ్డి వెంకట రాములు ప్రభాకర్ సిపిఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామిఈ  కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు సిపిఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామిరంగన్న,ఆశన్న, చెన్నయ్య,రవి,నాగార్జున,ఏఐవైఎఫ్ నాయకులు పరమేష్, ఏఐఎస్ఎఫ్ నాయకులు ప్రవీణ్, వీరేశ్, భరత్,గురుస్వామి, భీమేశ్,తిరుమలేశ్ కార్మిక సంఘాల నాయకులు నారాయణ, ప్రభుదాసు, తిమ్మప్ప తదితర నాయకులు పాల్గొన్నారు.

భారత కమ్యూనిస్టు పార్టీ  (CPI) 
జోగులాంబ గద్వాల జిల్లా

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333