మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ మరో సారి విజయం
మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ మరో సారి విజయం సాధించడం ఖాయమని బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మాలోత్.కవిత దీమా వ్యక్తం చేశారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని ఎంపీ కార్యాలయంలో ఎమ్మెల్సీలు తక్కెళ్ళపల్లి. రవీందర్ రావు, సత్యవతి రాథోడ్ లతో కలసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ... ఎంపీ ఎన్నికలలో పోలైన ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పడ్డాయని, నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు... వంద రోజులలో ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో కాంగ్రెస్ పై ప్రజల్లో అసంతృప్తి ఉందని ,బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీకి పట్టంకట్టనున్నాయన్నారు. పెద్ద ఎత్తున కౌంటింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు వేసిన వారందరికీ హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ , మున్సిపల్ చైర్మన్రామ్మోహన్ రెడ్డ్ , బి.ఆర్.ఎస్ నేతలు పాల్గొన్నారు.
బైట్స్1. మాలోత్ కవిత...బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి...
2. తక్కెళ్ళపల్లి... రవీందర్ రావు...ఎమ్మెల్సీ...
3. సత్యవతి రాథోడ్... ఎమ్మెల్సీ...