రైతు రుణమాఫీ తో పాటు రేషన్ కార్డులు కూడా మంజూరు చేయాలి....... వేమూరి

మునగాల 16 మే 2024
తెలంగాణ వార్తా ప్రతినిధి :+
. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన అసెంబ్లీ ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీల పథకాల హామీలతో అధికారం చేపట్టిన తరువాత ఇచ్చిన ప్రతి హామీ డిసెంబర్ 9వ తారీఖు నాడే అమలు చేస్తానని తదుపరి 6 గ్యారంటీలకు చట్టబద్ధత చేసి అధికారం చేపట్టిన వంద రోజులలో పూర్తిస్థాయిలో అమలు చేస్తామని చెప్పి. తదుపరి పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో. ఎలక్షన్ కోడ్ వల్ల పథకాలు అమలు చేయడానికి అడ్డంకి ఏర్పడింది. ఇప్పుడు. ఎన్నికలు ముగిశాయి కాబట్టి. ఇచ్చిన ఆరు గ్యారెంటీల లో. కేవలం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మాత్రమే పూర్తిస్థాయిలో అమలవుతుందని మిగిలిన గ్యారెంటీలు 500 కే గ్యాస్ సబ్సిడీ చాలామందికి అందలేదని అదేవిధంగా 200 యూనిట్ల లోపు అర్హులైన వారికి గృహ జ్యోతి పథకం పూర్తిస్థాయిలో అందరికీ అందడం లేదని. వృద్ధులకు వితంతువులకు. 4000 పెన్షన్ ప్రతి అర్హత కలిగిన మహిళలకు 2500 రైతులకు 500 బోనస్ రెండు లక్షల రైతు రుణమాఫీ నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అర్హులైన విద్యార్థులకు స్కూటీలు. వికలాంగులకు. పెంచుతాను అన్న ఆసరా పెన్షన్ అమలు కాకపోవడం. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు. కొత్త రేషన్ కార్డుల మంజూరు .అలాగే. ఇటీవల ఏర్పాటు చేసిన వివిధ కులాలకు కార్పొరేషన్ లకు. విధులు నిధులు కేటాయించకపోవడం కుల గణన చేపట్టకుండా బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ప్రకటించకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావడం. ఇలా ఇంకా ఎన్నో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేసి. అర్హులైన పేదలకు అండగా నిలవాలని మండల పరిధిలోని నరసింహాపురం గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారులు డాక్టర్ వేమూరి సత్యనారాయణ. ఒక ప్రకటన ద్వారా విలేకరులకు తెలియజేశారు.