అమరవీరుల పోరాట ఫలితమే తెలంగాణ సాయుధ పోరాటం

Sep 16, 2025 - 16:35
 0  4
అమరవీరుల పోరాట ఫలితమే తెలంగాణ సాయుధ పోరాటం

అడ్డగూడూరు 16 సెప్టెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగుడూరు మండల కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.  ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి హాజరై మాట్లాడుతూ..ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో 4వేల మంది కమ్యూనిస్టు పార్టీ నాయకులు ప్రాణాలను తృణప్రాయంగా పెట్టి రాజకరులను ఎదిరించిన ఘనత కమ్యూనిస్టు నాయకులదే అని అన్నారు.అలాంటి పోరాట పటిమ గలిగిన తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఈ నాటి బీజేపీ నాయకులు మదే అని చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. అదే విధంగా సీపీఎం అడ్డగుడూరు మండల కార్యదర్శి బుర్రు అనిల్ కుమార్ మాట్లాడుతూ.. రేపు మండల వ్యాప్తంగా తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు భాగంగా 30 బైక్ లతో భారీ ర్యాలీ నిర్వహించి అమరులైన కమ్యూనిస్టు నాయకులను స్మరించుకావాలని అనీ అన్నారు.అనంతరం మండల కేంద్రంలో స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర ముగింపు చేయడం జరుగుతుంది.ఈ కార్యక్రమంలో ప్రజలు అందరు స్వచ్ఛందంగా రావాలని పిలుపునిచ్చారు.


   ఈ కార్యక్రమంలో అడ్డగుడూరు మండల కమిటీ సభ్యులు వళ్ళంబట్ల శ్రీనివాసరావు, మాధను థామస్,బండి నర్సింహా స్వామి,కురేమిటి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333