రైతుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం పాల్గొన్న బిఆర్ఎస్ కార్యకర్తలు

తెలంగాణ వార్త *పెన్ పహాడ్ మార్చి 15 మండల పరిధిలోని చీదెల గ్రామం కు కాళేశ్వరం నుండి ఎస్ ఆర్ ఎస్ పి కాలువల ద్వార పంటలకు నీళ్లు ఇవ్వకపోవడంతో రైతుల పోలాలు ఎండిపోయి రైతులకు తీవ్ర అన్యాయం జరిగి నష్టం వాటిల్లిందని రైతుల పక్షాన అసెంబ్లీలో మాజీ మంత్రివర్యులు,సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాల తప్పిదలను ఎండగడుతుంటే చూడలేక పాలకవర్గం, అడుగగా అసెంబ్లీ సమావేశాల నుండి జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారు. దీనికి నిరసనగా ఈ రోజు మొత్తం తెలంగాణలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి రైతులు సైతం భారీ ఎత్తున పాల్గొని దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో భాగంగా మండల చీదెళ్ల గ్రామంలో గ్రామపంచాయతీ ఆవరణలో సింగిల్ విండో చైర్మన్, వెన్న సీతారాం రెడ్డి అధ్యక్షతన ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాజీ మంత్రివర్యులు సూర్యాపేట స్థానిక శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి నియోజకవర్గంలోని ప్రతి పల్లె ప్రతి తండా తిరుగుకుంటూ, ఎకరాకు తక్కువలో తక్కువ 30 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి నష్టపోయిన రైతులను పరామర్శించి కంటతడి పెట్టారన్నారు. ఇదే బాధను శాసన సభ్యుడిగా ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో ప్రజల కష్టాలను రైతుల బాధలను, వెల్లవిస్తుంటే కనీసం ఐదునిమిషాలు మాట్లాడకుండానే, కాంగ్రెస్ శాసనసభ్యులు మంత్రులు, ప్రజలకు నెరవేర్చని ఆరు గ్యారంటీలు 420 హామీలు బయట పెడతారని భయముతో మాజీమంత్రి జగదీష్ రెడ్డి ని ప్రతిపక్ష వాదన లేకుండా చేయడం కోసం సస్పెండ్ చేశారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలోమాజీ సర్పంచ్ పరెడ్డి సీతారాం రెడ్డి, మండల నాయకులు కీర్తి యలమంచయ్య గౌడ్, మాజీ సర్పంచ్ కొండమీది వెంకన్న, మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు సొంటి శ్రీను, దేవాలయ కమిటీ చైర్మన్ మోదుగు నర్సిరెడ్డి, కొండమీది ఎమ్మెల్యే వెంకన్న, బొల్లం నాగరాజు, ఎర్రమళ్ళ వెంకన్న, మునగలేటి వెంకటేష్, కీర్తి శ్రీను, గుడుపూరి సత్యనారాయణ, కొండమీది వెంకన్న, కొండమీది సుధాకర్, గ్రామ టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.