ఉచిత కంటి వైద్యశిబిరం.

Mar 15, 2025 - 20:55
Mar 15, 2025 - 21:12
 0  6
ఉచిత కంటి వైద్యశిబిరం.

అంతకపేట లో ఫీనిక్స్ ఫౌండేషన్,శంకర కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలోఈ నెల 16,న

ఉచిత కంటి వైద్యశిబిరం.

అక్కన్నపేట  15 మార్చి 2025 తెలంగాణవార్త ప్రతినిధి:- ఫీనిక్స్ ఫౌండేషన్ జిల్లా అంధత్వ నివారణ సంస్థ మరియు శంకరా కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో హైదరాబాద్,నానక్ రాం గూడ వారు ఉచితకంటి వైద్యశిబిరం ఈ నెల 16వ తేదీ ఆదివారం రోజున సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం అంతకపేట్ గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమం ఉదయం 9గం నుండి మధ్యాహ్నం 2గం వరకు నిర్వహిస్థారు. 

ఉచితంగా కంటి పరీక్షలు చేసి లోపం ఉన్న వారిని గుర్తించి కంటి చూపు మెరుగు పడేలా ఆపరేషన్ ద్వారా ఐ.ఓ.ఎల్ అమర్చనున్నట్లు,ఒక ప్రకటనలో తెలిపారు.అంతే కాకుండా.కంటిశుక్లం ఉన్న వారికి ఉచితంగా సర్జరీ చేస్తామని,అదే రోజున హైదరాబాద్ వరకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని,కంటి పరీక్షలకు హాజరయ్యే పేషేంట్ ఆదార్ కార్డు జిరాక్స్,ఫోన్ మరియు ఏమైనా రోజు వాడే మందులు వారి వెంట తెచ్చుకోవాలని,తలంటు స్నానం చేసి రావాలని విషయాన్ని సంబంధిత బంధు మిత్రులందరికి తెలియచేయలని తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333