భారత విప్లవ దార్శనికుడు మారోజు వీరన్న 

May 16, 2024 - 22:49
 0  6
భారత విప్లవ దార్శనికుడు మారోజు వీరన్న 
భారత విప్లవ దార్శనికుడు మారోజు వీరన్న 
భారత విప్లవ దార్శనికుడు మారోజు వీరన్న 
భారత విప్లవ దార్శనికుడు మారోజు వీరన్న 

ఖమ్మం మే  16 :  దేశంలో బహుజనులైన ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల అభివృద్ధి సంక్షేమం  వ్యవస్థ మార్పుతోనే సాధ్యమని , అందుకు ఐక్య విప్లవ కార్యాచరణ అవసరమని గ్రహించి , దశాబ్దాల ముందే భారత విప్లవ   విప్లవ పధం మార్గాన్ని నిర్దేశించిన మారోజు వీరన్న భారత విప్లవ దార్శనీకుడని సామాజిక న్యాయ జె ఎ సి చైర్మన్ ,  ప్రొఫెసర్ ప్రభంజన యాదవ్ , లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోతు బద్రు నాయక్ , వీరనారీమణుల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలు భుఖ్య ఉపేంద్ర బాయి కొనియాడారు. గురువారం మారోజు వీరన్న 25వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కమ్యూనిజం , అంబేద్కర్ ఇజం రెండు కలగలిపి దేశంలో నూతన విప్లవ భావజాలం నిర్దేశించిన  మారోజు వీరన్న నేటి విప్లవకారులకు మార్గదర్శకుడని తెలి ఫారు. మారోజు వీరన్న స్వగ్రామం సూర్యాపేట జిల్లాలోని  కరివిరాల కొత్త గూడెం లో మారోజు వీరన్న స్తూపం , విగ్రహం ఎదుట నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో   దివంగత మారోజు వీరన్న సతీమణి చైతన్య , దిశా , ఆయన కుటుంబ సభ్యులు , గ్రామ పెద్దలు వీరనారీమణుల ఆశయ సాధన సమితి గౌరవ అధ్యక్షురాలు ఎస్ కే.నజిమా నాయకులు జ్యోతి , చందు , త్రివేణి , వీరన్న నాయక్ , రవీంద్ర నాయక్ పాల్గోన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333