చెత్త పేరుకుపోయిన భద్రాచలం ప్రయాణ ప్రాంగణము బస్టాండ్

Mar 15, 2025 - 20:32
Mar 15, 2025 - 20:35
 0  6
చెత్త పేరుకుపోయిన భద్రాచలం ప్రయాణ ప్రాంగణము బస్టాండ్
చెత్త పేరుకుపోయిన భద్రాచలం ప్రయాణ ప్రాంగణము బస్టాండ్

చెత్త పేరుకుపోయిన భద్రాచలం ప్రయాణ ప్రాంగణము (బస్టాండ్), ప్రయాణికులకు ఇబ్బందికరంగా దుర్వాసనలు వెదజల్లుతూ ఎన్నో రోగాలకు నిలయమైన భద్రాచలం బస్టాండ్ ప్రయాణ ప్రాంగణం - జాతీయ మానవ హక్కుల సంఘం


భద్రాచలం నిత్యం వేలాదిమంది ప్రయాణికులతో రద్దీగా ఉండే ప్రాంతం ఎన్నో ప్రదేశాల నుంచి ఎన్నో రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం బ్రతుకుతెరువు కోసం మరియు పుణ్యక్షేత్రమైన భద్రాద్రి రాముడి దర్శనం కోసం నిత్యం వేలాదిమంది ప్రయాణిస్తూ ఉన్న ఈ భద్రాచలం ప్రయాణ ప్రాంగణం బస్టాండ్లో చెత్త పేరుకుపోయి దుర్వాసనను వెదజల్లుతూ ఉన్నాయి, సరైన సౌకర్యాలు లేక ఎంతో మంది ప్రజలు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు ఇదిలా ఉండగా ఫ్రీ బస్ సౌకర్యం ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావడంతో నిత్యం కడకల్లాడుతూ వేలాదిమంది ప్రయాణికులతో ఉన్న మన భద్రాచలంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న భద్రాచలం ప్రయాణ ప్రాంగణం బస్టాండ్ ఈ విధంగా ఉండటం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితికి నిదర్శనం, నిత్యం ప్రయాణికులతో పాటు బస్సు డ్రైవర్లు మరియు కండక్టర్లు డిపో మేనేజర్ సైతం ఆ ప్రాంగణంలో ఉంటూనే ఉన్నా ఏమాత్రం నిమ్మక నీరెత్తునట్టుగా వ్యవహరిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి, ఇది పూర్తిగా పర్యవేక్షణ లోపం కింద పరిగణలోకి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము, వచ్చే నెలలో భద్రాచలంలో ప్రాముఖ్యత కలిగిన శ్రీరామనవమి సందర్భంగా దీన్ని ప్రత్యేక శ్రద్ధతో భద్రాచలం ఐటిడిఏ పిఓ, మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్, మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ, మరియు భద్రాచలం ఏ.ఎస్పి, పర్యవేక్షణలోకి తీసుకొని సరైన సౌకర్యాలతో భద్రాచలానికి శ్రీరామనవమి దర్శనానికి రాబోతున్న భక్తులకు మరియు అధికారులకు మరియు రాజకీయ నాయకులకు అందరికీ అనువన విధంగా ఉండాలని అదే విధంగా ఎల్లప్పుడూ ఉంచేలా పర్యవేక్షణలో చూడాలని కోరుతున్నాము, కావున భద్రాచలం బస్టాండ్ డిపో మేనేజర్ కి మరియు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కి జాతీయ మానవ హక్కుల సంఘం విన్నపం ఈ కార్యక్రమంలో వేణుగోపాల్ రెడ్డి గుజ్జుల, పొద్దుటూరి ప్రేమ్ సాయి, గుగులోతు బాబు, బానావత్ వంశీ తేజ్.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333