డి.ఎస్.పి ధర్మ సమాజ్ పార్టీ 2వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు

మిర్యాలగూడ మండల అధ్యక్షులు నవీన్ మరియు వేములపల్లి మండల అధ్యక్షులు శివన్
మిర్యాలగూడ 15 మార్చ్ 2025 తెలంగాణవార్త ప్రతినిధి:- డి.ఎస్.పి ఉద్యమ మార్గదాత బహుజన చక్రవర్తి మాన్యశ్రీ కాన్షీరాం , 91వ జయంతి సందర్భంగా ఈ రోజు 15-03-2025 ధర్మసమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ అదేశాలమేరకు మిర్యాలగూడ నియోజకవర్గ కేంద్రం లో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో 2వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నియోజకవర్గ ఇంచార్జ్ MLA అభ్యర్థి, జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి తరి యల్లయ్య, కాన్షిరాం , పూల మాల వేసి వారు మాట్లాడుతూ కన్షీరామ్ ,చెప్పిన మాట ఏమిటంటే ఓటు అమ్ముకుంటే మన కన్నబిడ్డలను మనమే అమ్ముకున్నట్లు అని ఓటు హమారా రాజ్ తుమారా నైహి చలేగా నైహి చెలేగా ఓట్లు మావి రాజులు మీరవుతారా ఇకపై చెల్లదు చెల్లదు ఓటు హమారా రాజ్ హమారా అని ఈ ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప బహుజన వీరుడని చెప్పారు అనంతరం పార్టీ భవిష్యత్ కార్యాచరణ తెలియచేస్తూ నాగార్జున సాగర్ హాలియా లో జరగబోయే కాన్షిరాం జయంతి సభ ను BC/SC/ST DFC ప్రజలంతా విజయవంతం చేయాలనీ కోరారు, అలాగే గౌరవ ధర్మ సమాజ్ పార్టీ అధినాయకుడు డా.విశారదన్ మహారాజ్ , ఈ రోజు జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశం లో మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు అదే 1 లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర ఏప్రిల్ 14 అంబేడ్కర్ జయంతి రోజునా ఆదిలాబాద్ లో మొదలుపెట్ట బోతున్నారు కాబట్టి బహుజనులు అంతా సిద్దపడి ఉండాలని తెలియచేసారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రాజశేఖర్, మిర్యాలగూడ మండల అధ్యక్షులు నవీన్, దామరచర్ల మండల అధ్యక్షులు సైదులు, వేములపల్లి మండల అధ్యక్షులు శివన్ మరియు వివిధ మండల నాయకులు దేవేందర్, లక్ష్మయ్య, వంశీ తదితరులు పాల్గొన్నారు.