రైతుకు ఆదాయాన్ని సమకూర్చే కీరదోస సాగు
జోగులాంబ గద్వాల 1 మార్చి 2025 తెలంగాణ వార్త ప్రతినిధ:- ఆరుగాలం కష్టపడి పండించే రైతన్నకు తక్కువ నీటితో, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయాన్ని సమకూర్చే కీరదోస సాగు వల్ల రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చని ఎంటిసీ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ జనరల్ మేనేజర్ జి వెంకటేశ్, అసిస్టెంట్ మేనేజర్ లక్ష్మన్న తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని అనేక గ్రామాలలో కీరదోససాగు పంట వల్ల అనేకమంది రైతులు లబ్ధి పొందుతున్నారని ఆయన తెలిపారు. కేవలం రెండు నెలలలో ఫలా సాయాన్ని అందించే కీర దోస సాగు చేపట్టాలని రైతులకు సూచించారు. నెల తర్వాత వచ్చే దోసకాయలలో గ్రేడ్ వన్ 160 మిల్లీమీటర్ సైజు దోసకాయలు రూ. 45, 80 మీ.మీ సైజు రూ .26, 30 మీ.మీ సైజూ రూ.13లు, గ్రేడ్ 2 లో 80 మిల్లీమీటర్ల సైజు రూ .29, 30 మిమి సైజు రూ. 13, 30 మీ.మీ రూ.4, _30 మిల్లీమీటర్లు రూ .4 రేపు ప్రకారం కీర దోసకాయలు కంపెనీ కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోనీ ఐజ,వెంకటపురం, కొండపల్లి, గట్టు, మల్దకల్, కేటి దొడ్డి,గుడి దొడ్డి, కంభంపాడు తోపాటు సింగినోడి ప్రాంతాలలో కీరదోస సాగు పంట సాగు చేస్తున్నారని తెలిపారు. పంట పూర్తిఆయ్యాక 15 రోజులలో వారి అకౌంట్లో డబ్బులు జమ చేస్తారని తెలిపారు.