ఏడవ రోజు జర్నలిస్టుల రిలే నిరాహార దీక్షకు మద్దతు పలికిన శ్రీశైల నిర్వహితులు

Jul 1, 2025 - 20:45
 0  44
ఏడవ రోజు జర్నలిస్టుల రిలే నిరాహార దీక్షకు మద్దతు పలికిన శ్రీశైల నిర్వహితులు

ఏడవ రోజు జర్నలిస్టుల రిలే నిరాహార దీక్ష లకు మద్దతు తెలిపిన శ్రీశైలం నిర్వాసితుల సంగం.

జర్నలిస్టుల రిలే నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపిన శ్రీశైలం నిర్వాసితుల సంఘం ఉమ్మడి జిల్లాల గౌరవ అధ్యక్షులు. పెబ్బేటి నారాయణ రెడ్డి డాగోజీ.గోవిందు, షబ్బీర్ అలీ యస్. శ్రీనివాసులు.

కొల్లాపూర్ డివిజన్ కేంద్రంలో ఏడవ రోజు మంగళవారం రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్న సందర్భంగా. జర్నలిస్టుల ఇల్లు మిగతా డిమాండ్ల పైన రిలే నిరాహార దీక్ష శిబిరంలో కూర్చున్న జర్నలిస్టుకు సంఘీభావం మద్దతు తెలిపిన శ్రీశైలం నిర్వాసిత సంఘం. అధ్యక్షుడు. పెబ్బేటి నారాయణ రెడ్డి డాగోజీ. యస్. శ్రీనివాసులు శ్రీశైలం నిర్వాసితుల సంఘం సభ్యులు.నియోజకవర్గంలో ఉన్నఅన్ని మండలాలలోజర్నలిస్టుల అందరికీ ఇళ్ల స్థలాలు మిగతా డిమాండ్ల ఇవ్వాలనిరాష్ట్ర ప్రభుత్వాన్ని శ్రీశైల నిర్వాసితులు 98 జీవో నిర్వాసితులు సంఘం డిమాండ్ చేశారు.

 శ్రీశైలం నిర్వహితులు పెబ్బేటి నారాయణరెడ్డి, డగోజీరావు, గోవిందు మాట్లాడుతూ

పట్టణంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తూ ప్రొసీడింగ్‌ కూడా వచ్చిందన్నారు. కానీ జర్నలిస్టులకు మాత్రం ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని రాష్ట్ర ప్రభుత్వంపై ఆవేదన వ్యక్తం చేశారు. సమాజ చైతన్యం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న జర్నలిస్టులు కోడి కుయకముందే సమాజాన్ని, మేల్కొని ఎక్కడ ఏ సంఘటన జరిగిన తక్షణమే వార్త ప్రపంచానికి చాటిచెప్పే జర్నలిస్టులు. మూడు దశాబ్దాలుగా.ఇండ్ల స్థలం కోసం ఎదురుచూస్తున్నారని వారి డిమాండ్లను వెంటనే తీర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. రాజకీయ నాయకులు ప్రతిపక్షంలో వున్నప్పుడు జర్నలిస్టులకు ఆనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత హామీలను విస్మరించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.అలాగే శ్రీశైలం నిర్వాసితులకు 98 జీవో అమలు చేసి ఉద్యోగాలు ఇస్తామని స్వయంగా కొల్లాపూర్ ఎలక్షన్ ల ముందు ముఖ్యమంత్రి నిండు సభలో శ్రీశైలం నిర్వాసితుల న్యాయమైన డిమాండ్ అని జీవోను అమలు చేస్తామని ముఖ్యమంత్రి మాట ఇచ్చారు ఇప్పటికైనా ఇక్కడున్న పాలకులు పట్టించుకోకపోవడంతో జీవో నీరు కారుస్తుందని అన్నారు ఇప్పటికైనా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు  ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి 98 జీవోను అమలు చేసి ఉద్యోగాలు ఇప్పించాలని నిర్వాసితులు ఆవేదన వ్యక్తపరిచారు నిర్వాసితులు కలిసి ఉద్యోగుల కొరకు ఆమరణ నిరాహార దీక్ష చిన్నంబాయి కూడలిలో నిర్వహిస్తామని త్వరలోనే సభ్యులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీశైలం నిర్వాసితుల సభ్యులు గోవిందు, సుధాకర్, రంగస్వామి, షబీర్, రాఘవేంద్ర శెట్టి, జహంగీర్ భాష,ఎస్ శ్రీనివాసులు,వెంకటం పల్లి నరసింహ,నటరాజ్, వెంకటరాముడు,ఉత్తరాయ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Vishnu Sagar Chinnamabavi Mandal Reporter Wanaparthi District Telangana State