ఇంటర్ లింకింగ్ విద్యుత్తు లైన్ ప్రారంభం

Feb 24, 2025 - 19:56
Feb 24, 2025 - 20:39
 0  4
ఇంటర్ లింకింగ్ విద్యుత్తు లైన్ ప్రారంభం

మధిర, 24 ఫిబ్రవరి 2025 తెలంగాణవార్త ప్రతినిధి. మధిర నియోజవర్గ పరిధిలో మధిర, బోనకల్ మండల ప్రజలకు నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా అందజేయాలని గౌరవ ఉప ముఖ్యమంత్రి మరియు విద్యుత్ శాఖ మాత్యులు శ్రీయుత భట్టి విక్రమార్క గారి ఆదేశాలతో బోనకల్ మండలంలోని మోటమర్రి టాపింగ్ నుండి సిరిపురం సబ్ స్టేషన్ వరకు అనగా రెండున్నర కిలోమీటర్ల మేర 25 లక్షల రూపాయల వ్యయంతో నూతన విద్యుత్ లైన్స్ నిర్మాణం పూర్తి చేసుకొని ఈరోజు విద్యుత్ శాఖ ఖమ్మం సర్కిల్ ఎస్ ఇ ఏ. సురేంద్ర గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. దీనితో బోనకల్, మధిర మండల ప్రజలకు మధిర 132కెవి సబ్ స్టేషన్ నందు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పటికీ పెద్దగోపతి నుండి ప్రత్యక్షంగా బోనకల్లు మీదుగా సిరిపురం వరకు ప్రత్యామ్నాయంగా విద్యుత్ సరఫరా చేసే అవకాశం ఏర్పడినది. ఈ కార్యక్రమంలో వైరా డివిజన్ డిఈ బండి శ్రీనివాసరావు మధిర సబ్ డివిజన్ ఏడిఈ ఎం. అనురాధ, మధిర రూరల్ సెక్షన్ ఏఈ ఎస్. మైథిలి మరియు ఇతర విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333