ఈనెల 8న గిరిజనుల సీత్లా పండుగ

Jul 5, 2025 - 22:47
 0  0
ఈనెల 8న గిరిజనుల సీత్లా పండుగ

తిరుమలగిరి 06 జూలై 2025 తెలంగాణ వార్త రిపోర్టర్

ఈనెల 8 న గిరిజన బంజారా సంస్కృతి సీత్లా భవాని పండగను మండల వర్కింగ్ ప్రెసిడెంట్ , సంత్ సేవాలాల్ గౌరవ అధ్యక్షులు ధరావతు జుమ్మిలాల్ నాయక్ గిరిజనులు ఘనంగా నిర్వహించాలని అన్నారు. వారు మాట్లాడుతూ గిరిజనులు పశుసంపద, రక్షణ కోసం, వర్షాలు సకాలంలో కురిసి పంటలు బాగా పండాలని ప్రాచీన కాలం నుంచి ఆనవాయితీ వస్తున్న సీత్లా పండుగ ఉత్సవాలు గిరిజనులు ప్రత్యేక భక్తి శ్రద్దతో జరుపుకుంటారు. వర్షాకాలం ప్రారంభంలో పెద్ద పూసల పార్టీలో గిరిజన తండాల్లో సీత్లా పండుగ సందడి కనిపిస్తుంది అన్ని గిరిజన తెగల్లో ఈ పండుగ జరుపుకోవడం విశేషం స్థానికంగా ఈ పండుగను దాటుడు పండుగగా కూడా గిరిజనులు పిలుస్తారు. పూర్వం గిరిజనుల పెద్ద మనిషి లో కలలోకి సీత్లా మాత గిరిజ నులు ఏడుగురు దేవతల్లో చిన్నదైనా సీత్లా దేవత కనిపించి తనను పూజిస్తే పశుసంపద దక్కుతుందని చెప్పడంతో అప్పటినుండి గిరిజన తండాల్లో ఈ పండుగను జరుపుకోవడం ఆనవయితిగా వస్తుంది. ఆదివాసి గిరిజనులు లంబాడి తండాలను గుర్తించారంటే అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించారని అన్నారు. 20, 25 సంవత్సరాల కిందట ఇందిరమ్మ ఇల్లు కట్టినారు అని అన్నారు. గత పది పదిహేను సంవత్సరాల నుండి గత పాలకులు గిరిజన తండాలను పట్టించుకోలేదు. మళ్లీ ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది గిరిజన తండాలలో ఇందిరమ్మ ఇల్లు మంజూరై గిరిజన వాసులు సంతోషం వ్యక్తం చేస్తూ ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వనికి ఇప్పటికీ రుణపడి ఉంటామని చెప్పారు..ఆషాడ మాసంలో జరిగే బోనాల పండుగకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించినట్లుగానే లంబాడి గిరిజన తండలలో అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకునే సీత్లా పండగకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సంత్ సేవాలాల్ మండల అధ్యక్షులు బానోతు రాములు నాయక్, ప్రధాన కార్యదర్శి బానోతు కిష్టు నాయక్, మాజీ కౌన్సిలర్ గుగులోతు భాస్కర్ నాయక్, మండల ఎస్టి సెల్ అధ్యక్షులు ప్రేమ్ ప్రసాద్, రామోజీ, ఉపాధ్యక్షులు హీరు నాయక్, మోహన్ నాయక్, రాజు నాయక్, రవి నాయక్, సుధాకర్ నాయక్, రాజశేఖర్, లఘుపతి, భాస్కర్ నాయక్, సోమన్న,భూక్య కుమార్, బిచ్చు నాయక్, సైదా నాయక్ లు తదితరులు పాల్గొన్నారు.. 

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034