వెబ్ ఎక్స్ వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

Mar 1, 2025 - 19:38
Mar 1, 2025 - 19:41
 0  2
వెబ్ ఎక్స్ వీడియో కాన్ఫరెన్స్  లో  కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
వెబ్ ఎక్స్ వీడియో కాన్ఫరెన్స్  లో  కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

సూర్యపేట 1 మార్చి 2025 తెలంగాణ వార్త ప్రతినిధి:- ఎనర్జీఎస్ వర్క్స్, గ్రామాలలో పనికోరినవారందరికి  పని దినాలు కల్పించడం,  ఇందిరమ్మ ఇల్లు, ఐహెచ్ఎల్స్, నర్సరీలు, త్రాగునీరు, శ్రీనిధి, బ్యాంకు లింకేజీలు మొదలగు అంశాలపై కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఎంపీడీవోలు ,ఎంపీలు, ఏపీవోలు, ఏపీఎం, టిఏలు, ఎఫ్ ఏ లతో వెబ్ ఎక్స్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎనర్జీస్ పనులలో పని కావాల్సిన కూలీలకు అందరికీ పనులు కల్పించాలని ఎ పనులు ఇట్టి విషయంలో నిర్లక్ష్యం వహించిన సిబ్బంది పై కఠిన చర్యలు తీసుకోబడతాయని కలెక్టర్ తెలిపారు. ఆరు కేటగిరీల ఉపాధి హామీ పనులను పూర్తిచేసి చెల్లింపులు చేయాలని కలెక్టర్ సూచించారు. ఎస్ బి ఎం లో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణాలను త్వరగా పూర్తిచేసి ఎస్బిఎం యాప్ లో అప్లోడ్ చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. నర్సరీలలో 100% శాతం జర్మినేషన్ ఉండాలని అన్నిచోట్ల షెడ్ నేట్స్ వేయాలని,  మొక్కల సంరక్షణ చేపట్టాలని తెలిపారు. శ్రీనిధి, బ్యాంకు లింకె జిల్లాలో మండలాల వారీగా లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు మార్చి 5 కల్లా ఇచ్చిన లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ ఏపియమ్ లకు ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లను గ్రౌండ్ చేసేందుకు అవగాహన కల్పించాలన్నారు.మండలాలలో నిర్మాణం చేసిన మోడల్ హౌస్ లను చూపించాలని కలెక్టర్ తెలిపారు. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని త్రాగునీటి సరఫరా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. మున్సిపాలిటీలు మండలాలలో త్రాగునీటి సరఫరా లో పైపులైన్లు లీకేజీలు, మోటార్ల సామర్థ్యాలను పరిశీలించి వెంటనే మనమతులు చేపట్టాలన్నారు. విధులలో నిర్లక్ష్యం వహించిన వారిపై ఉపేక్షించేది లేదని కలెక్టర్ పేర్కొన్నారు.

 ఈ వెబ్ ఎక్స్ వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ వెంట డిఆర్డిఏ పిడి, జెడ్పిసిఈఓ వివి అప్పారావు, డిపిఓ నారాయణరెడ్డి, ఎంపీడీవోలు, ఎంపీలు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333