శ్రీ తిమ్మప్ప స్వామి దేవాలయంలో భక్తుల సందడి
జోగులాంబ గద్వాల 1 మార్చ్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి:- మల్దకల్,. అపర తిరుపతిగా విలసిల్లుతున్న ఆదిశీలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం సందర్భంగా భక్తులు హాజరై దేవాలయంలో పూజలు, అర్చనలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు స్వామివారి పూజలు నిర్వహించి తరించారు. వారికి ఆలయ చైర్మన్ పట్వారీ ప్రహ్లాద రావు, ఈవో సత్య చంద్రారెడ్డి, దేవాలయ సిబ్బంది సేవలందించారు. అనంతరం జడ్చర్లకు చెందిన జమీల జయరాములు దంపతులు(రామాపురం)అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.