మా వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేయొద్దు

Oct 6, 2025 - 17:40
 0  6
మా వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేయొద్దు

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ బాధలు మేం పడలేము

గుంతలు తీసి పూడ్చకుండా వెళుతున్న కాంట్రాక్టర్

ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్న పట్టించుకోని వైనం

45వ వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను అడ్డుకున్న బిఆర్ఎస్ జిల్లా నాయకులు గండూరి కృపాకర్.

సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రణాళిక లేకుండా చేపడుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మా వార్డు ప్రజలు ఆ ఇబ్బందులు పడలేరని అందుకే మా 45వ వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు చేయవద్దని బిఆర్ఎస్ జిల్లా నాయకులు గండూరి కృపాకర్ అన్నారు. సోమవారం పట్టణంలోని 45వ వార్డులో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను ఆయన అడ్డుకొని మాట్లాడారు.ఇటీవల వార్డులో నిర్వహించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులతో ప్రజలు ప్రమాదాల బారిన పడ్డారని ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం పెద్ద పెద్ద గుంటలు తీసి చిన్న పైపులు వేసి నామ మాత్రంగా పూడ్చి వెళ్తున్నారని దీంతో ప్రజలు వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు జిల్లా కేంద్రంలో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ఏ వార్డులో విజయవంతంగా పూర్తయ్యాయో కాంట్రాక్టర్, అధికారులు సమాధానం చెప్పాలన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు విజయవంతంగా పూర్తి చేసిన ఓ వార్డును స్పూర్తిగా చూపించి మిగతా వార్డుల్లో పనులు చేపట్టాలని అన్నారు. తీసిన గుంటలు ఎక్కడికక్కడ వదిలేసి పనులు చేపడితే ప్రజల ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ప్రజల సొమ్ముతో ప్రైవేట్ కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు చేస్తూ ప్రజల ప్రాణాలకే ముప్పు తెస్తున్నారని వాపోయారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల కోసం తీసిన గుంటలను నెలల తరబడి పుడ్చకపోవడంతో తమ వార్డుకు చెందిన ఒకరికి తల పగిలిందని ఇలాంటి ప్రమాదాలు జరిగిన సంఘటనలు కోకోలాలుగా ఉన్నాయని అన్నారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ కు కూడా ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదని అన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మా వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు నిలిపివేసి ప్రజల ప్రాణాలను రక్షించాలని వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో కుక్కడపు బిక్షం, వెంకటేష్, సందీప్, వార్డు పెద్దలు, ప్రముఖులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333