పల్స్ పోలియో ప్రోగ్రాం పైఅవగాహనకార్యక్రమం
జోగులాంబ గద్వాల 27 ఫిబ్రవరి 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ఇటిక్యాల. మండల కేంద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంనందు డాక్టర్,విష్ణు ఆధ్వర్యంలో, పల్స్ పోలియో ప్రోగ్రాం 03/03/ 2024 నుండి 05/03/2024 వరకు పోలియో కార్యక్రమం పై ఏఎన్ఎంలకు,ఆశా కార్యకర్తలకు అవగాహన కార్యక్రమంనిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా డాక్టర్ విష్ణు మాట్లాడుతూ..... మండలంలోని వివిధ గ్రామంలోని (0)సంవత్సరాలనుంచి(05)సంవత్సరాల పిల్లలకు స్కూల్లో గాని అంగన్వాడి సెంటర్లలో గాని వాళ్లందరికీ పల్స్ పోలియో చుక్కలు వేసి వందశాతంపల్స్,పోలియోకార్యక్రమంనువిజయవంతం చేయాలని వైద్య సిబ్బందికి డాక్టర్ విష్ణు సూచించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్లు,ఏఎన్ఎంలు ,ఆశా కార్యకర్తలు, తదితరులుపాల్గొన్నారు.