ప్రొసీడింగ్ అధికారులకు ఎన్నికల శిక్షణ తరగతులు

నిర్వహించిన అదనపు కలెక్టర్ వీరారెడ్డి

Oct 6, 2025 - 20:48
 0  8
ప్రొసీడింగ్ అధికారులకు ఎన్నికల శిక్షణ తరగతులు

అడ్డగూడూరు 06 అక్టోబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోనీ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిటిసి,జెడ్పిటిసి రెండవ సాధారణ ఎన్నికల నిర్వహణ నిమిత్తం ప్రొసీడ్ అధికారులకు శిక్షణా కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ వీరారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ వీరారెడ్డి సందర్శించి,శిక్షణ తరగతులను ఉద్దేశించి ప్రసంగించారు.ఎన్నికల సమయంలో తగు జాగ్రత్తలు పకడ్బందీగా తీసుకోవాలని అన్నారు.

ఇట్టి కార్యక్రమంలో ఎంపీడీవో శంకరయ్య, జెడ్.పి.టి.సి రిటర్నింగ్ అధికారి నరసింహ,తహశీల్దార్ శేషగిరిరావు,ఎంపీఓ ప్రేమలత,కార్యాలయ పర్యవేక్షకులు దేవేందర్ రావు,ఎంపిటిసి రిటర్నింగ్ అధికారులు,సహాయ రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు మరియు కార్యాలయ సిబ్బంది గ్రామపంచాయతీ కార్యదర్శిలు,పివోలు, ఏవోలు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333