అడ్డగూడూరు మండల కేంద్రంలో గాదరి కిషోర్ దిష్టిబొమ్మ దహనం చేసిన యూత్ కాంగ్రెస్ నాయకులు 

Oct 24, 2024 - 19:24
Oct 24, 2024 - 21:17
 0  11
అడ్డగూడూరు మండల కేంద్రంలో గాదరి కిషోర్ దిష్టిబొమ్మ దహనం చేసిన యూత్ కాంగ్రెస్ నాయకులు 
అడ్డగూడూరు మండల కేంద్రంలో గాదరి కిషోర్ దిష్టిబొమ్మ దహనం చేసిన యూత్ కాంగ్రెస్ నాయకులు 

అడ్డగూడూరు, 24అక్టోబర్2024 తెలంగాణవార్త రిపోర్టర్:- అడ్డగూడూరు మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అనంతరం అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో గాదరి కిషోర్ మీద ఫిర్యాదు చేశారు.మందుల సామేల్ నాయకత్వములోని నీవు చేసిన అవినీతి సొమ్ము (ఇసుక) తొందర్లోనే బయట పెడుతమని సవాల్ చేశారు.రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి మీద ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రి పేదల పెన్నిధి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు మండల యూత్ కాంగ్రెస్ నాయకులు తెలిపారు.తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పదవిని వదులుకొని నిరంతరం కొట్లాడిన వెంకట రెడ్డి పట్ల నువ్వు చేస్తున్న వ్యాఖ్యలకు బిఆర్ఎస్ పార్టీ మళ్లీ మూల్యం చెల్లించుకోక తప్పదని కాంగ్రెస్ నాయకులు అన్నారు. అధికారం కోల్పోయి మతిభ్రమించి మైకుల ముందు ఏది పడితే అది మాట్లాడుతున్న గాదరి కిషోర్ తస్మాన్ జాగ్రత్త అని వారు హెచ్చరించారు.ఎంతోమంది పేదవారికి సహాయం చేసి పేదల గుండెల్లో ఒక సుస్థిర స్థానం ఏర్పరచుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పట్టుకొని కొజ్జా అని సంబోధించడంలోనే గాదరి కిషోర్ సంస్కారహీనుడు అని తేలిపోయింది.మూసి ప్రక్షాళన చేస్తే ప్రభుత్వానికి జిల్లా మంత్రికి ,తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ కి మంచి పేరు వస్తుందని..అది జీర్ణించుకోలేకనే నిన్న జరిగిన ప్రెస్ మీట్లో ఆవేశానికి లోనై ఇష్టానుసారంగా మాట్లాడారని యూత్ కాంగ్రెస్ నాయకులుఆరోపించారు.తుంగతుర్తి నుంచి 50 వేల మెజార్టీతో నిన్ను ఓడించిన బుద్ధి మారలేదు, ఇకనైనా బుద్ధి మార్చుకోకుంటే తుంగతుర్తి నియోజకవర్గంలో ఎక్కడ తిరిగిన కోడిగుడ్లు, టమోటాలతో స్వాగతం పలకల్సి వస్తుందని వారు స్పష్టం చేశారు,కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు బాలెంల మహేందర్,బండ నరేందర్,పనికెర సూర్య,బాలెంల జీవన్,పోలేపక ఉపేందర్,ఉడుగుమల్లేశ్,పెరుమండ్ల నిఖిల్,ప్రవీణ్ గుడెపు,సన్నీ బోడ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333