మార్కెట్ యార్డులో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే

Jan 10, 2026 - 10:25
 0  204
మార్కెట్ యార్డులో  అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే

  తిరుమలగిరి 10 జనవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

 వ్యవసాయ మార్కెట్ కమిటీ తిరుమలగిరి నందు  తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ తిరుమలగిరి నందు నూతన అభివృద్ధి నిర్మాణ పనులు మరియు మరమ్మతుల పనులు . బోర్వేల్ (2) నీటి సరఫరా రూ.10.00. నూతన మరుగుదొడ్ల నిర్మాణం రూ.56.00. ⁠మినరల్ వాటర్ ప్లాంట్ (2) నిర్మాణం రూ.20.00. ⁠షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం రూ.74.00. ⁠గోదాములు మరియు వాటర్ ప్లాంట్ రూమ్ రూఫ్ మరమ్మత్తులు రూ.13.00 ⁠కార్యాలయం మరమత్తులు రూ.15.00. ⁠వేబిడ్జ్ మరమత్తులు రూ.6.50.మొత్తం 194.50 ఇట్టి నూతన నిర్మాణ మరియు మరమ్మతుల పనులను ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మార్కెట్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అలాగే మార్కెట్ యార్డు ప్రహరి గోడ చుట్టూ ఫెన్సింగ్ చేపిస్తానని అన్నారు అనంతరం అధికారుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఇట్టి కార్యక్రమమునకు  ఎల్సోజు చామంతి నరేష్ చైర్ పర్సన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ తిరుమలగిరి గారు కార్యవర్గ సభ్యులు రాపాక సోమేష్, చెరకు వేణుగోపాల్, కందెం అంజయ్య, దొడ్డ రమేష్, గుంగులోతు రాములు, జంపాల రవీందర్, బైరబోయిన సైదులు, మహమ్మద్ హఫీజ్, సంకెపెల్లి నర్సింహ రెడ్డి దామెర కృష్ణమూర్తి పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి