ఇసుక ట్రాక్టర్ పట్టివేత... కేసు నమోదు
అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ ను పట్టుకోవడంతోపాటు డ్రైవర్, యజమానిపై కేసు నమోదు చేసినట్టు పట్టణ ఎస్సై కళ్యాణ్ కుమార్ తెలిపారు... ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి... గద్వాల మండల పరిధిలోని గొనుపాడు నుండి ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా గద్వాల పట్టణంలోని నవరంగ్ థియేటర్ వైపుకు ఇసుకను తరలించేందుకు వస్తుండగా సుంకులమ్మ మెట్టు సమీపంలో ఇసుక ట్రాక్టర్ ను పట్టుకోవడం జరిగింది... దీంతో డ్రైవర్ మద్దిలేటి, యజమాని కర్రెప్పలపై కేసు నమోదు చేయడంతో పాటు ట్రాక్టర్ ను సీజ్ చేయడం జరిగింది.