మధిర టిడిపి నియోజకవర్గంలో"సెప్టెంబర్ 17 హైదరాబాద్ విముక్తి దినోత్సవం ఘనంగా"నిర్వహించారు

Sep 17, 2025 - 20:06
Sep 18, 2025 - 20:27
 0  4
మధిర టిడిపి నియోజకవర్గంలో"సెప్టెంబర్ 17 హైదరాబాద్ విముక్తి దినోత్సవం ఘనంగా"నిర్వహించారు

నేడు సెప్టెంబర్ 17 న మధిర టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో *హైదరాబాద్* *విముక్తి* *దినోత్సవం* ఘనంగా నిర్వహణ 

   తెలంగాణ వార్త ప్రతినిధి రా వెళ్ళ : ఈ కార్యక్రమం నిర్వహణ టీడీపీ సమావేశానికి మధిర మున్సిపల్ టౌన్ టీడీపీ అధ్యక్షులు మల్లాది హనుమంతరావు అధ్యక్షత వహించారు 

      ఈ సమావేశంలో పాల్గొన్న ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ డాక్టర్ వాసిరెడ్డి రామనాధం జాతీయ పతాకం ఎగుర వేశారు

  రామనాధం మాట్లాడుతూ 

    హైదరాబాద్ నిజాం సంస్థానం 1948 సెప్టెంబర్ 17 న విముక్తి చెంది ఇండియన్ యూనియన్ లో (భారతదేశంలో ) వీలీనమవటం ఒక మహత్తర చారిత్రక ఘట్టం అని అన్నారు నిజాం ప్రభుత్వ నిరంకుశ రాక్షస పాలన, ఖాసీం రాజ్వీరజాకార్ల అకృత్యాలు దేశముఖుల, దొరల, జమీందార్ల, జాగీర్దార్ల పీడనకు వ్యతిరేకంగా పీడిత ప్రజలు, రైతాంగం తిరగబడి

  అప్పటి హైదరాబాద్ స్టేట్ లోని ఆంధ్రమహాసభ, భారత క మ్యూనిస్ట్ పార్టీలతో కలిసి,కాంగ్రెస్ పార్టీ, తెలుగు భాషాభి మానులు, మేధావులు, ఆర్య సమాజంవారు నేత్రుత్వంలో సాయుధ రైతాంగ పోరాటం చేశారు ఈ పరిణామం లో నాలుగు వేలమంది అమరులు అయ్యారు పది వేల మంది జైళ్ల పాలయ్యారు ఏబయ్ వేలమంది మహిళలు అకృత్యాలకు గురి అయ్యారు రజాకార్లు గ్రామాలు తగులబెట్టారు అయినా సాయుధ రైతులు పది లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచారు మూడు వేల గ్రామాల్లో సొంత పాలన గావించారు 

  ఇండియన్ యూనియన్ పోలీసులరాకతో నిజాం ప్రభువు తోక ముడిచి భారత సైన్యం ముందు హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు సెప్టెంబర్ 17,1948 న లొంగి పోయి నిజాం సంస్థనాన్ని భారత దేశంలో కలిపారు 

   భారత ప్రభుత్వం 12/03/2024 న ప్రతి సంవ త్సరం సెప్టెంబర్ 17 న హైదరాబాద్ విముక్తి దినం జరుపటానికి నిర్ణయం తీసుకొని గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది 

    77సంవత్స రాల క్రితం భారత దేశంలో కలిసిన తేదీన వివిధ పేర్లతో పలు పార్టీలు ఉత్సవాలకు తెరపడినది అని రామనాధం సమావేశంలో మాట్లాడుతూ అన్నారు

 అమర వీరులకు జోహార్లు అర్పించారు 

  టీడీపీకి పూర్వ వైభవం తెలంగాణాలో తీసుక రావటానికి కృషి చేయాలన్నారు 

తలంగాణా రాష్ట్ర టీడీపీ పగ్గాలు జాతీయ తెలుగుదేశం పార్టీ పోలిట్బ్యూరో సభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి అప్ప చెప్పాలని సమావేశంలో పాల్గొన్న నాయకుల అభిప్రాయ పడ్డారు 

   జై హింద్ 

జై టీడీపీ

జై తెలంగాణ

అమర వీరులకు జోహార్లు అని నాయకులు నినాదా లిచ్చారు

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State