ఇంద్రమ్మ ప్రొసీడింగ్ కాపీలను అందజేసిన జూపల్లి అనుచరులు

17-09-225 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం : చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన గూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాఫీలను మహిళా లబ్ధిదారులకి పంపిణీ చేసిన మాజీ సర్పంచ్ మామిళ్ళపల్లి చక్రవర్తి, ఇంద్రమ్మ కమిటీ సభ్యులు.
జూపల్లి అనుచరుడైన మామిళ్ళపల్లి చక్రవర్తి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ గూడెం గ్రామ సీనియర్ నాయకులు,యువకులు, గ్రామపంచాయతీ కార్యదర్శి విక్రమ్ యాదవ్, లబ్ధిదారులకు ముగ్గు పోసి ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు.
చిన్నంబావి మండలం గూడెం గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో గూడెం జూపల్లి అనుచరులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఇల్లు లేని ప్రతి పేదవారికి ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది, మా గూడెం గ్రామానికి మొదటి విడతలో భాగంగా 11 మందికి ప్రొసీడింగ్ కాపీలను ఇవ్వడం జరిగింది. రెండవ విడుదలవారీగా ఇండ్లు లేని ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇండ్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుందని తెలియజేశారు. ఇందిరమ్మ ఇండ్ల ప్రోసిడింగ్ కాపీలు తీసుకున్న లబ్ధిదారులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుంచి ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నా మమ్ములను మా గ్రామ పెద్దలు గుర్తించి జూపల్లికి తెలియజేయడంతో జూపల్లి యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తించి మాకు ఇండ్లు నిర్మిస్తున్నందుకు , మామిళ్ళపల్లిి చక్రవర్తికి, జూపల్లిి కృష్ణారావుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము ఎల్లవేళల రుణపడి ఉంటామని సంతోషని వ్యక్తపరిచారు.
ఈ కార్యక్రమంలో జూపల్లి అనుచరుడైన మామిళ్ళపల్లి చక్రవర్తి, మరి అదే విధంగా గ్రామ పంచాయతీ సెక్రెటరీ విక్రమ్, పార్టీ నాయకులు అవ్వల్ల వెంకటస్వామి, వెంకటేశ్వరరావు, కుమ్మరి బుచ్చన్న, పెద్దగాలి, లక్ష్మోజి, రొడ్డ కురుమయ్య,మేకల సతీష్, పెద్ద హుస్సేన్, మధుగం శాంతయ్య తదితరులు పాల్గొన్నారు.