అడ్డగూడూరు మండల కేంద్రంలో వాహనాలను ఆకస్మిక తనిఖీ

రామన్నపేట  సీఐ వెంకటేశ్వర్లు  అడ్డగూడూరు ఎస్సై వెంకట్ రెడ్డి

Aug 30, 2025 - 18:58
 0  241
అడ్డగూడూరు మండల కేంద్రంలో వాహనాలను ఆకస్మిక తనిఖీ
అడ్డగూడూరు మండల కేంద్రంలో వాహనాలను ఆకస్మిక తనిఖీ

అడ్డగూడూరు 30 ఆగస్టు 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని రామన్నపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు వాహనాలను శనివారం రోజున ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన రాకపోకలలో ఉన్న ద్విచక్ర,త్రిచక్ర వాహనాలు,ఆటోలు, కార్లను ఆపి డ్రైవింగ్ లైసెన్స్,వాహన పత్రాలు,హెల్మెట్ ధారణ వంటి అంశాలను పరిశీలించారు.వాహనదారులు రూల్స్‌కి విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరిస్తూ..నియమ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. ద్విచక్ర వాహన దారులు ప్రయాణంలో హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని అన్నారు.ఎవరు కూడా చట్ట విరుద్ధంగా వ్యవహరించకూడదని,శాంతి భద్రతల విషయంలో అలసత్యం వహించేది లేదని తెలిపారు.ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి, ఏఎస్ఐ ఈశ్వర్, కానిస్టేబుల్ లు సంతోష్ రెడ్డి,శ్రీనువాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333