బిపి షుగర్ మందులు పరీక్షల అనంతరం పంపిణీ చెయ్యాలి.. NCD ప్రోగ్రామ్ ఆఫీసర్ :- డాక్టర్ రాజు 

Apr 16, 2024 - 19:36
 0  16
బిపి షుగర్ మందులు పరీక్షల అనంతరం పంపిణీ చెయ్యాలి.. NCD ప్రోగ్రామ్ ఆఫీసర్ :- డాక్టర్ రాజు 
బిపి షుగర్ మందులు పరీక్షల అనంతరం పంపిణీ చెయ్యాలి.. NCD ప్రోగ్రామ్ ఆఫీసర్ :- డాక్టర్ రాజు 

 జోగులాంబ గద్వాల 16 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:-  జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రము మానోపాడు నందు ఈరోజు ఆరోగ్య మందిర్ నందు పనిచేసే MLHP స్టాఫ్ మరియు ఏఎన్ఎం లకు ఎన్సిడిపై  మానోపాడ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రిజ్వానా తన్వీర్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది.

    ఈ సమావేశానికి ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రాజు  విచ్చేసి వచ్చే వారంలో సెంట్రల్ టీం విసిటింగ్ సందర్భంగా ఎన్సిడి పై రివ్యూ తీసుకోవడం జరిగింది.. నెల జరిగే ఎన్సిడి ఫాలో ఆప్స్ మరియు మందులు సక్రమంగా పంపిణీ విధానం ఆన్లైన్లో ఎంట్రీ చేసే విధానాన్ని మరియు పేషెంట్లకు ట్రీట్మెంట్ కాడ్స్ ఇచ్చే విధానంలో సూచనలు సలహాలు తెలియజేస్తూ మరియు ప్రతి ఒక్కరికి ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ఏర్పాటు చేస్తున్నారా లేదా అనే దిశగా అందరిని అడిగి తెలుసుకున్నారు. త్వరలో వీరికి ఎన్సీడీ నందు అందరికీ అబ్బా లింక్ చేయాలని తెలిపారు. తర్వాత అమరవాయి సబ్ సెంటర్ ను సందర్శించి బీపీ షుగర్ రికార్డులను తనిఖీ చేశారు  

     ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్స్ శ్యాంసుందర్ మక్సుద్ ఎస్ టి ఎస్ రమేష్ మరియు,Phc సిబ్బంది పాల్గొన్నారు..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333