ఎమ్మెల్యే శ్రీహరిని కలిసి ఎంపీ అభ్యర్థురాలు డాక్టర్" కడియం కావ్యకు మద్దతు తెలిపిన రాష్ట్ర బైండ్ల సంఘం

Apr 16, 2024 - 19:39
 0  33
ఎమ్మెల్యే శ్రీహరిని కలిసి ఎంపీ అభ్యర్థురాలు డాక్టర్" కడియం కావ్యకు మద్దతు తెలిపిన రాష్ట్ర బైండ్ల సంఘం
ఎమ్మెల్యే శ్రీహరిని కలిసి ఎంపీ అభ్యర్థురాలు డాక్టర్" కడియం కావ్యకు మద్దతు తెలిపిన రాష్ట్ర బైండ్ల సంఘం

వరంగల్ 15 ఏప్రిల్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- వరంగల్ పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ "కడియం కావ్యకు మద్దతు తెలియజేస్తున్నట్లు బైండ్ల సంఘం రాష్ట్ర కమిటీ ప్రకటించింది. అన్మకొండలోని ఎమ్మెల్యే కడియం శ్రీహరి నివాసంలో అన్ని రాజకీయ పార్టీల బైండ్ల సంఘం ప్రతినిధులు కలిసి తమ మద్దతు ప్రకటిస్తున్నట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏదుల్ల గౌరీశంకర్ ప్రకటించారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలో సుమారు 30వేల పై చిలుకు ఓట్లు కడియం కావ్యకు మూకుమ్మడిగా వేయుంచి వారి గెలుపుకు కృషి చేస్తామని ఈ సందర్బంగా తెలియజేశారు. మాదిగ సామాజిక వర్గానికి తరతరాల నుండి పౌరోహిత్యం మంచి చెడు కార్యక్రమాలన్నీ చేస్తూ స్నేహపూర్వంగా కలిసిమెలిసి జీవిస్తున్న తరుణంలో..బైండ్ల సామాజిక వర్గాన్ని కించపరుస్తూ, ఉపకులాల అభివృద్ధిని జీర్ణించుకోలేక మందకృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సలహాదారులు చిట్టంపల్లి శ్రీనివాస్ రావు, ఇంద్రపల్లి వెంకటేశం, రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఏర్పుల భాస్కర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏర్పుల గాలయ్య, రాష్ట్ర కార్యదర్శులు ఇంద్రపల్లి సంజీవ, బీజ్ఞపల్లి రవి, ఉప్పునూతల నర్సింగ్ రావు, మారపాక సుధాకర్, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు దేశపక నగేష్ జనగామ జిల్లా అధ్యక్షులు మారపాక మనోహర్, వనపర్తి జిల్లా అధ్యక్షులు కోడిగంటి రామ్ చందర్, నాయకులు బరుపట్ల శ్రీనివాస్, ఇంద్రపల్లి రాజేందర్, గంగుల శ్రీనివాస్, ఇంద్రపల్లి రమేష్, జీలుకర రంజిత్, కడియం సురేష్ , కడెం రవివర్మ , కడెం చంద్రమౌళి, చినపాక మురళి, వెంకన్న,కడియం బాలకృష్ణ,తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333