మాదిగల వేయి గొంతులు లక్ష డప్పుల మహాసభను విజయవంతం చేయాలి
ఎం.ఎస్.పి ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇంచార్జ్ కందుకూరి సోమన్న
మాడుగులపల్లి11 జనవరి 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- ఫిబ్రవరి 7న హైదరాబాదులో జరగబోయే మాదిగల వెయ్యి గొంతులు లక్ష డప్పుల మహాసభను విజయవంతం చేయడం కొరకు మాడుగులపల్లి మండల కేంద్రంలో శనివారం కళాకారుల ప్రచార యాత్ర నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎం ఎస్ పి ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్చార్జి కందుకూరి సోమన్న పాల్గొని మండల కేంద్రంలో డప్పు చప్పులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కందుకూరి సోమన్న మాట్లాడుతూ.. మందకృష్ణ మాదిగ సారధ్యంలో 30ఏళ్ల మాదిగల ఆత్మగౌరవ పోరాటానికి అంతిమంగా జరుగుతున్న మాదిగల వెయ్యి గొంతులు లక్ష డప్పుల మహాసభను మాదిగలందరూ ఐక్యంగా పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మచ్చ ఏడుకొండలు,మడుపు శీను,దైద సత్యం,బకరం శ్రీను,మునుగోటి యాదయ్య,ఎం,జె,ఎఫ్ మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ దర్శనం రాంబాబు మాదిగ,దర్శనం శ్యాంప్రసాద్,బోడ సునీల్,ఇరుగు శ్రీశైలం, చెరుకుపల్లి రాజు, మాదిగ,బొల్లెంపల్లి శ్రీను, చిట్యాల సురేందర్, గుడుగుంట్ల శ్రవణ్,కళాకారులు తదితరులు పాల్గొన్నారు.