ప్రోకామ్ స్లామ్ లో మెరిసిన ఎర్ర మట్టి నేల బిడ్డ

Dec 26, 2025 - 20:39
Dec 27, 2025 - 16:24
 0  2
ప్రోకామ్ స్లామ్ లో మెరిసిన ఎర్ర మట్టి నేల బిడ్డ

ప్రోకామ్ స్లామ్ లో మెరిసిన ఎర్ర మట్టి నేల బిడ్డ

ప్రోకామ్ స్లామ్ ఇంటర్నేషనల్ ఈవెంట్ లో పతాకాలు సాధించిన ఆర్పీఎఫ్ సబ్ ఇన్ స్పెక్టర్ బలభక్తుల వెంకటేశ్వర్లు

మల్లంపల్లి : ప్రోకామ్ స్లామ్ ఇంటర్నేషనల్ ప్రమోట్ చేసిన పలు నిర్ధిష్ట రన్నింగ్ ఈవెంట్ లలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పతాకాలు సాధించిన ఎర్రమట్టి నేల బిడ్డ ఆర్పీఎఫ్ సబ్ ఇన్ స్పెక్టర్ బలభక్తుల వెంకటేశ్వర్లు, 

ములుగు జిల్లా మల్లంపల్లి మండలం రామచంద్రపూర్ గ్రామానికి చెందిన బలభక్తుల (వెంకట్) వెంకటేశ్వర్లు రైల్వే శాఖలో సబ్ ఇన్ స్పెక్టర్ గా కొనసాగి, విశ్రాంత ఉద్యోగిగా(VRS) క్రీడా రంగంలో కొనసాగుతున్నాడు,

భారతదేశంలో ఇంటర్నేషనల్ ఎండ్యూరెన్స్ రన్నింగ్ ఈవెంట్ లలో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచి దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారాలలో ఒక్కటైన "ప్రోకామ్ స్లామ్" పతాకం (మెడల్) సాధించాడు,

ఈ నెల 21న కోల్ కతాలో టాటా స్టీల్ వరల్డ్ వారు నిర్వహించిన మారథాన్ 25కిలో మీటర్ల రన్నింగ్ లో 2: 28గ.ని. నిర్ధిష్ట సమయంలో పూర్తి చేసి ప్రోకామ్ స్లామ్ పురస్కారాన్ని డైరెక్టర్ కెవిన్ చేతుల మీదుగా అందుకున్నాడు,

గతంలో ముంబాయిలో 42కిలో మీటర్ల, బెంగుళూరు లో 10కిలో మీటర్ల, న్యూడిల్లీ లో 21కిలో మీటర్ల రన్నింగ్ ఈవెంట్ లలో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు,

వెంకటేశ్వర్లు ప్రోకామ్ స్లామ్ పురస్కారం సాధించినందుకు గాను రామచంద్రపూర్ గ్రామస్థులు, అధికారులు, మిత్రులు, తదితరులు అతడిని అభినందించారు.

Alli Prashanth kumar భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్